జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కంగనా సంచలన వ్యాఖ్యలు
Kangana Comments On GHMC Elections. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలు డిసెంబర్ 1
By Medi Samrat Published on
4 Dec 2020 6:39 AM GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలు డిసెంబర్ 1 జరుగగా.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. లెక్కింపులో భాగంగా ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉండడం పట్ల హీరోయిన్ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోందని ఆమె ట్వీట్ చేసింది.
'ప్రియమైన కాంగ్రెస్ పార్టీ... మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.. రోజంతా కంగనా కంగనా అంటూ నా నామ జపం చేస్తున్నాయి.. ఇలాగైతే మీకు ఏ లాభం ఉండదు. క్లిష్టమైన నగరాల్లో బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది' అని కంగనా రనౌత్ ట్వీట్ చేసింది.
Next Story