మిషన్‌ 5151.. కుంభ్‌ సందేశ్‌ లో ఎమ్మెల్సీ కవిత..!

Kalvakuntla Kavitha Flags Off Kumbh Sandesh Yatra. గ్రామోదయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో మిషన్‌ 5151 పేరిట కుంభ్‌ సందేశ్‌ యాత్రను ప్రారంభించారు.

By Medi Samrat
Published on : 19 Feb 2021 4:43 PM IST

Kalvakuntla Kavitha Flags Off Kumbh Sandesh Yatra
ప్రపంచ దేశాలకు భారతదేశం విశ్వగురువు స్థానంలో ఉండటం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గ్రామోదయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో మిషన్‌ 5151 పేరిట కుంభ్‌ సందేశ్‌ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రను హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి నుంచి ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు.


పూర్వకాలంలో ప్రపంచదేశాలకు మన పెద్దలు పాఠాలు నేర్పించారని.. కరోనా వల్ల ఇప్పుడు మన సంస్కృతి, సంప్రదాయాలను మరోమారు నేర్పుతున్నామని కవిత అన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు కుంభమేళ ఆవశ్యకతను తెలియజేసేందుకు యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా వంటి పరిస్థితుల్లో ఇలాంటి యాత్ర చాలా అవసరమన్నారు.

హైదరాబాద్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర దేశంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తూ.. హరిద్వార్‌కు చేరుకుంటుందని సామాజికవేత్త శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 41 రోజుల పాటు యాత్ర సాగుతుందని.. ఢిల్లీ నుంచి హరిద్వార్‌ వరకు దాదాపు 100 మందితో పాదయాత్ర సాగుతుందని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడిన యువతను మన సంస్కృతి, సంప్రదాయాలను పాటించే విధంగా అవగాహన యాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని ఆధ్యాత్మిక వేత్త సత్యవాణి అన్నారు.




Next Story