హైదరాబాద్‌లోని అమ్మాయిలను, జంటలను వీడియోలు, ఫోటోలు తీయడమే వారి పని

Jhamunda: How Insta moral police brigade are secretly filming Hyderabad's girls, couples. మీరు ఎక్కడికైనా వెళుతున్నారు.. కొన్ని ప్రాంతాలకు స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉన్నారు. మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2022 1:43 PM IST
హైదరాబాద్‌లోని అమ్మాయిలను, జంటలను వీడియోలు, ఫోటోలు తీయడమే వారి పని

మీరు ఎక్కడికైనా వెళుతున్నారు.. కొన్ని ప్రాంతాలకు స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉన్నారు. మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ మిమ్మల్ని ఎవరో ఫాలో చేస్తున్నారని తెలిస్తే.. మీరు చేసే ప్రతి చిన్న పనిని కూడా రికార్డు చేస్తున్నారని.. దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారని తెలిసిందంటే..? వెన్నులో వణుకు పుడుతోంది కదూ..! ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటిదే చోటు చేసుకుంటూ ఉంది. మోరల్ పోలీసింగ్ లో భాగంగా ఒక కమ్యూనిటీకి చెందిన వారిని టార్గెట్ చేస్తూ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో బైక్స్ నుండి మాల్స్ వరకు వివిధ బహిరంగ ప్రదేశాలలో గుర్తు తెలియని వ్యక్తులచే వీడియోలను రికార్డు చేయిస్తూ ఉన్నారు. కొంతమంది పురుషులు, మహిళలకు సంబంధించిన విషయాలను రికార్డు చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్ పేజీ `jhamunda_official' ఒక నిర్దిష్ట కమ్యూనిటీకి సంబంధించిన మోరల్ పోలీసింగ్ జరుగుతోంది. మహిళలపై అసభ్యకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తోంది. వారు తమ పోస్టుల ద్వారా మహిళలను అవమానపరిచారు. వారి పోస్ట్‌లు వర్గాల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. ఈ పోస్ట్‌లన్నింటికీ అనుచిత కామెంట్‌లు కూడా ఉన్నాయి.

ఈ పోస్ట్‌లలో చాలా వరకు 'ముసల్మానో కా నామ్ బర్బద్ కియా,' 'ఖురాన్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు' వంటి బ్యాక్‌గ్రౌండ్‌ ఆడియోతో ఉన్నాయి. ఒక వీడియోలో, ఒక పురుషుడు- స్త్రీ (స్పష్టంగా ముస్లిం మహిళ) ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా.. కెమెరా వారిని అనుసరిస్తూనే ఉంటుంది. ఒక ముస్లిం మహిళ ముస్లిమేతర వ్యక్తితో డేటింగ్ చేస్తోందని ఆ పేజీలో వారిద్దరినీ బహిరంగంగా తిట్టడం మొదలుపెట్టారు.

మరో వీడియోలో పార్కింగ్ ఏరియాలో ఇద్దరు అమ్మాయిలు బురఖాలు మార్చుకోవడం రహస్యంగా చిత్రీకరించారు. "నెక్స్ట్ గ్యాలెరియా మాల్ ఆయే హెయిన్ యే లోగ్, కాలేజ్ బంక్ కర్కే, పార్కింగ్ మే బుర్ఖా రిమూవ్ కరాయ్ (కాలేజీకి బంక్ కొట్టిన అమ్మాయిలు వారి బురఖాని తొలగించడానికి గ్యాలెరియా మాల్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతానికి వచ్చారు), " అని ఉంది. వీక్షకులకు, వారి తల్లిదండ్రులకు తెలిసేలా ఈ విషయాన్ని తెలియజేయమని వీడియోలో కోరారు.

మరొక వీడియోలో, ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి స్మోకింగ్ చేస్తున్నట్లు కనుగొనబడింది. పేజీ నిర్వాహకుడు ఇలాంటి వారికి సంబంధించి తల్లిదండ్రుల శ్రద్ధ అవసరం అనిచెప్పుకొచ్చారు. మరికొందరు తిరుగుతూ ఉండగా.. నిఖాకు ముందు డేటింగ్ చేయడం హరామ్ అంటూ పోస్టులు పెట్టారు. ఇలాంటి అమ్మాయిలు ఇస్లాం కు చెడ్డపేరు తీసుకుని వస్తున్నారంటూ కూడా పోస్టులను పెడుతూ వస్తున్నారు.

కొన్ని పోస్ట్‌లలో, ఈ వీడియోలు సదరు అమ్మాయి-అబ్బాయి తల్లిదండ్రులకు చేరాలని పేజీ అడ్మిన్ ఫాలోవర్స్ ను కోరాడు.

ఈ పేజీ ఎలాంటి వీడియోలను అందిస్తోంది..?

jhamunda_official.అనే పేజీని కాకుండా Jhamunda 2, Jhamunda, Jhamunda Army అనే పేజీలను తయారు చేశారు. కొందరిని కావాలనే టార్గెట్ చేస్తూ ఇలాంటి వీడియోలను పోస్టు పెడుతూ ఉన్నారు. ఫిర్యాదుల తర్వాత jamunda_official. పేజీ నుండి కొన్ని పోస్ట్‌లు తొలగించారు. అయితే అవి ఇతర అనధికారిక పేజీలలో అవే పోస్ట్‌లు మళ్లీ కనిపిస్తాయి. ప్రస్తుతం Jhamunda అఫీషియల్ గ్రూప్ లో పోస్ట్‌లు లేవు. అక్టోబర్ 10న jamunda_official.page ఇంస్టా id అమ్మకానికి ఉంది. కానీ ఝాముండా 2 పేజీలో ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంది.

jhamunda_official page. కి 12.3k ఫాలోవర్స్ ఉన్నారు. Jhamunda 2, Jhamunda, Jhamunda Army పేజీలకు 101 ఫాలోవర్లు, 1,284 ఫాలోవర్లు, 677 ఫాలోవర్లు ఉన్నారు.

కంటెంట్ ను ఎక్కడ నుండి పొందుతారంటే..?

jhamunda_official._ అనే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో తమ ఫాలోవర్లను వీడియోలు రికార్డు చేయమని అడుగుతుంది. మహిళలు, జంటలను రహస్యంగా చిత్రీకరించి, ఈ పేజీకి పంపమని ఫాలోవర్స్ ను అభ్యర్థిస్తుంది. ఈ పేజీని అనుసరించేవారు కంటెంట్‌ ను పంపిస్తూ ఉన్నారు. పేజీలోని ఒక పోస్ట్‌లో, బహిరంగ ప్రదేశాల్లో దాదాపు 900 తాము చెప్పిన పని చేస్తున్నారని తెలిపారు. "ఇప్పటికే 900 మంది అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలు.. ముస్లిమేతర అబ్బాయిలతో డేటింగ్ చేస్తున్న బహిరంగ ప్రదేశాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు నేను హైదరాబాద్‌లోని ప్రతి పౌరుడికి అధికారం ఇస్తున్నాను, మీరు ఎక్కడ ఇలాంటి వ్యక్తులు డేటింగ్ చేస్తున్నారో, ముస్లిం అమ్మాయిలు ముస్లిమేతరులతో డేటింగ్ చేస్తుంటే, దయచేసి తెలియజేయండి. మీ కెమెరాలో రికార్డ్ చేసి, మాకు పంపండి. నేను నా ఇన్‌స్టా పేజ్ ద్వారా విషయాన్ని వెల్లడిస్తాను. దయచేసి మీ సోదరీమణులు, కుమార్తెలను గమనిస్తూ ఉండండి. మన ముస్లిం అమ్మాయిలు లవ్ ట్రాప్‌కు బాధితులుగా మారడం నాకు ఇష్టం లేదు. (sic)," అని పోస్ట్ లో ఉంది.

ఝాముండా 2 పేజీ తనను ఎలా టార్గెట్ చేసిందో నగరంలోని ఓ బాలుడు న్యూస్‌మీటర్‌తో చెప్పుకొచ్చాడు. అతని ఫోటో షేర్ చేసి.. ఝాముండా టీమ్ అతన్ని రేపిస్ట్ అని పిలిచింది. బాలుడు తన సోదరిపై అత్యాచారం చేశాడని, అతడిని ఇంటి నుంచి గెంటేశాడని పేజీ నిర్వాహకుడు ఆరోపించాడు. గతంలో కూడా 'కింగ్‌డమ్ ఆఫ్ మలక్‌పేట్' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా అతనిపై సోషల్ మీడియాలో దాడి జరిగింది.

"ఈ పేజీలు నగరంలో ప్రశాంత వాతావరణాన్ని పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కొంతమంది మైనర్ బాలికలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఈ పేజీలు సోషల్ మీడియాలో వారి ప్రతిష్టను దిగజార్చడం ద్వారా యువతలో భయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పేజీల బారిన పడి డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఈ పేజీల ద్వారా ఆయా అమ్మాయిలు తీవ్రంగా వేదనలకు, అవమానాలకు గురవుతూ ఉన్నారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరు. వారు భయపతుంటారు, "అని అజ్ఞాత వ్యక్తి మాతో చెప్పుకొచ్చాడు.


పేజీ కార్యకలాపాలను నివేదించడానికి నగరంలోని కొంతమంది వ్యక్తులు ట్విట్టర్‌ ను వినియోగించారు. వారు తమ ట్వీట్లలో హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశారు. ఈ ట్విట్టర్ యూజర్లలో కొందరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. హైదరాబాద్ పోలీసులు మూడు కేసులు నమోదు చేసి ఈ పేజీని నడుపుతున్న వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఝాముండా అఫీషియల్ పేజీ అడ్మిన్ పై ఐపీసీ సెక్షన్ 509,506, 354(డి)తోపాటు మరికొన్ని సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేసినట్లు సీసీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీ ప్రసాద్ తెలిపారు. "Three cases have been registered against the administrator of the Jhamunda Official page under Section 509,506, 354(d) of IPC, and under some other sections," అని కేవీ ప్రసాద్ తెలిపారు. పేజీపై ఫిర్యాదులు చేసినప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్ నుండి తమకు ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని ఆయన తెలిపారు. ఈ పేజీ వెనుక ఉన్న వ్యక్తులను విచారించడానికి, పట్టుకోవడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Next Story