రియల్టర్ల నుంచి రూ. 22 కోట్ల విలువగల డబ్బు, నగదు స్వాధీనం చేసుకున్న ఐటీ
IT seizes Rs 22Cr worth cash, gold from Hyderabad & Bengaluru based realtors.బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన రెండు
By తోట వంశీ కుమార్ Published on 12 July 2022 2:33 AM GMTబెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన రెండు అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ గ్రూపుల నుంచి రూ. 22 కోట్ల విలువైన నగదు, నగలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ప్రముఖ కంపెనీలపై ఐటీ దాడులు నిర్వహించిన అనంతరం ఈ ఘటన జరిగింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. సదరు గ్రూప్‌లకు చెందిన 40 ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. రెండు అగ్రశ్రేణి రియల్టర్లు జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) కుదుర్చుకున్నారని.. ఆ కంపెనీల నుంచి సేకరించిన ఆధారాలు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కూడా ధృవీకరించాయి. JDAలోకి ప్రవేశించిన తర్వాత గ్రూప్ కంప్లీషన్ సర్టిఫికెట్లు పొందినప్పటికీ మూలధన లాభాలను ప్రకటించలేదు.
IT అధికారుల ప్రకారం.. మూలధన లాభాల వెల్లడి మొత్తం (ఉమ్మడి అభివృద్ధి ఒప్పందం ద్వారా పొందినది) రూ. 400 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. దాడుల సమయంలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 90 కోట్ల ఆదాయాన్ని దాచిన్నట్లు కనుగొనబడింది. "రియల్ ఎస్టేట్ డీల్‌లో యూనిట్ల విక్రయం ద్వారా గుర్తించదగిన ఆదాయానికి సంబంధించి ఈ గ్రూపులు రూ. 90 కోట్ల ఆదాయాన్ని అణిచివేసినట్లు స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైంది" అని ఐటి శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఈ సోదాల్లో రూ. 3.50 కోట్ల నగదు, రూ. 18.50 కోట్ల విలువైన బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రెండు గ్రూపులు (హైదరాబాద్ మరియు బెంగళూరుకు చెందినవి) వ్యాపారంలో తమ ఖర్చులను రూ. 28 కోట్లకు పెంచి పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని సీబీఐటీ గుర్తించింది. గ్రూప్ 'బోగస్' కొనుగోళ్లను క్లెయిమ్ చేసిందని గుర్తించారు. నిర్మాణ సామగ్రి యొక్క ఇన్‌పుట్-టాక్స్ క్రెడిట్ (బిల్లులు) కూడా పెంచినట్లు అధికారులు గుర్తించారు.