హైదరాబాద్‌లో రెండో రోజూ ఐటీ సోదాలు.. ఎవరెవరి ఇళ్లల్లో అంటే.?

By Knakam Karthik  Published on  22 Jan 2025 11:05 AM IST
telugu news, Tollywood, entertainment, Hyderabad, it raids, Tollywood producers

హైదరాబాద్‌లో రెండో రోజూ ఐటీ సోదాలు.. ఎవరెవరి ఇళ్లల్లో అంటే.?

హైదరాబాద్‌లో ఐటీ శాఖ అధికారుల దాడులు రెండో రోజైన బుధవారం కొనసాగుతున్నాయి. సిటీ వ్యాప్తంగా పలువురు టాలీవుడ్ నిర్మాతల నివాసాల్లో ఏకంగా 55 బృందాలు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సినిమా ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆరా తీస్తున్నారని టాక్. పుష్ప-2 మూవీకి సినిమాకు పెట్టిన బడ్జెట్.. వచ్చిన ఆదాయంపై అధికారులు తెలుసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఆయా సంస్థలు ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్ భారీగా ఉండటంతో ఐటీ అధికారులు రెండో రోజు కూడా తనిఖీలు చేపడుతున్నారు. మంగళవారం నుంచి హైదరాబాద్ సిటీ పరిధిలోని 8 చోట్ల ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో రెండో రోజు సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఐటీ అధికారులు ఆయా సంస్థలను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప-2 మూవీ బడ్జెట్, వరల్డ్ వైడ్‌గా వచ్చిన కలెక్షన్లపై వివరాలను నోట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిచ్చిన ఐటీ రిటర్న్స్ భారీగా ఉండటంతో రెండో రోజూ విస్తృతంగా పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం.

కాగా.. మంగళవారం సిటీ వైడ్‌గా మొత్తం 8 చోట్ల ఏక కాలంలో ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్స్ సోదాలు చేపట్టారు. అదే విధంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్వినిని బ్యాంకుఏ వివరాలు చూపించాలని ఐటీ అధికారులు కోరారు. అనంతరం ఆమెను నేరుగా బ్యాంకుకు తీసుకువెళ్లి ఆమె పేరుపై రిజిస్టరై ఉన్న లాకర్లను తెరిచి చూశారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను ఐటీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారాం.

Next Story