పెళ్లయ్యాక తొలిసారి అత్తారింటికి హైదరాబాద్‌కు వచ్చిన ఆంధ్రా అల్లుడు, అత్తమామల ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయాడు. సరూర్ నగర్ సమీపంలోని శారదానగర్‌కు చెందిన క్రాంతి, కల్పన దంపతులు కాకినాడకు చెందిన తమ అల్లుడి ముందు 130 రకాల వంటకాలు ఉంచారు.
ఖమ్మంపాటి క్రాంతి, కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లున్నారు. వీరి పెద్దకూతురి వివాహం ఇటీవల కాకినాడకు చెందిన మల్లిఖార్జున్‌తో జరిగింది. పెళ్లాయ్యాక ఇంటికి వచ్చిన అల్లుడికోసం అత్తింటివారు వెజ్, నాన్ వెజ్ తో కూడిన 130 రకాల వంటకాలు చేసి వడ్డించారు. వంటల లిస్ట్‌లో సంక్రాంతి పిండివంటలు, నాన్ వెజ్, వెజ్ , స్వీట్స్ ,పండ్లు, పులిహోర లాంటివి ఉన్నాయి.
మల్లికార్జున్ కు నాలుగు నెలల క్రితం వివాహం అయింది. అతడు మొదటి సంక్రాంతిని జరుపుకోడానికి అత్తారింటికి వచ్చాడు. అయితే ఈ విందు అతడికి ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.