ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్.. ఇద్దరు మృతి.. శంషాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

By Medi Samrat
Published on : 17 April 2022 4:34 PM IST

ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

శంషాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్‌ఆర్‌ మార్గంలో ఆగి ఉన్న లారీని నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒక పురుషుడు, ఒక మహిళ అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ఇద్దరిని కారు నుండి బయటకు తీసి పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, డ్రైవర్‌ను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Next Story