అలర్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నిబంధనలపై నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

By Srikanth Gundamalla  Published on  18 Feb 2024 2:43 AM GMT
hyderabad, traffic rules, instructions, cp srinivas reddy,

అలర్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై కీలక ఆదేశాలు 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే పలు మార్పులను చేసింది. ఇక హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యం పలు సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ సీపీ, ట్రాఫిక్‌ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నిబంధనలపై నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ హెచ్చరించారు. నిరంతరం ట్రాఫిక్‌ నియంత్ర చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పార్కింగ్ ఆక్రమణలు, ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూల్స్‌ను పాటించకపోతే చలాన్లు విధిస్తామని చెప్పారు. ఇక ముక్కుపిండి మరీ ఆ చలాన్లను వసూలు చేస్తామని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ వార్నింగ్ ఇచ్చారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించింది ఎవరైనా సరే అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని సీపీ చెప్పారు.

మరోవైపు నగరంలోకి గూడ్స్‌ వాహనాలు భారీగా వస్తున్నాయని అన్నారు. వీటి వల్ల భారీగా ట్రాఫిక్‌ ఏర్పడుతోందని చెప్పారు. గూడ్స్‌ వాహనాలకు కేటాయించిన సమయంలో మాత్రమే నగరంలోకి రావాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ చెప్పారు. కేటాయించిన సమాయాల్లో కాకుండా మిగతా సమయాల్లో వస్తే చలాన్లు వేస్తామని సూచించారు. ఇక ట్రాఫిక్‌పై కొత్త నిబంధనలు కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ లెస్‌ నగరంగా హైదరాబాద్‌ను మార్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ట్రాఫిక్ రోడ్‌ సేఫ్టీ మంత్‌ నిర్వహిస్తున్నామని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ తెలిపారు. అర్బన్ ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన ఇస్తున్నామని సీపీ చెప్పారు.

Next Story