హైదరాబాద్‌లో ఇవాళ పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌లో బక్రీద్‌ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పలు చోట్ల ఆంక్షలు విధించారు.

By Srikanth Gundamalla  Published on  17 Jun 2024 8:45 AM IST
hyderabad, traffic restrictions, bakrid,

 హైదరాబాద్‌లో ఇవాళ పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు 

హైదరాబాద్‌లో బక్రీద్‌ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పలు చోట్ల ఆంక్షలు విధించారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సందర్భంగా రద్దీ కొనసాగుతుందనీ.. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌ పోలీసులు ఆయా చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఓల్డ్ సిటీతో పాటు మాసబ్ ట్యాంక్, మీరాలం దర్గా, లంగర్ హౌస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని చెప్పారు. ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే ఆయా రూట్లలో అనుమించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు.

అలాగే బహదూర్ పురా ఎక్స్‌రోడ్స్‌, పురానూల్, కిషన్‌బాగ్, కామతి పురా వైపు నుంచి ప్రార్థనకు వచ్చే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించనున్నారు. ఇందుకోసం జూపార్క్‌, మసీదు అల్లా హు అక్బర్ ఎదురుగా పార్కింగ్‌కు ఏర్పాట్లను చేశారు. బక్రీద్ సందర్భంగా రద్దీని గుర్తించాలని సామాన్య వాహనదారులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు. వాహనాదారులు ఆయా మార్గాల్లో ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించారు. కాగా.. బక్రీద్ సందర్భంగా గ్రేటర్ పరిధిలో రిటైల్ బీఫ్ దుకాణాలను సోమ, మంగళవారాల్లో మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

Next Story