Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. నగరంలో పలువురు అరెస్ట్
నగరంలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు కొందరు నిర్వాహకులు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 2:00 PM ISTHyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. నగరంలో పలువురు అరెస్ట్
హైదరాబాద్: నగరంలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు కొందరు నిర్వాహకులు. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు తాజాగా కొందరిని పట్టుకున్నారు. బయట మసాజ్ సెంటర్ బోర్డు పెట్టి లోపల గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. స్పా, మసాజ్ సెంటర్స్ పై టాస్క్ఫోర్స్ పోలీసులు మరియు ఎస్ఓటి పోలీసులు నిఘాపెట్టి.. నగరంలో రెండు వేరు వేరు ప్రాంతాలలో దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు.
అల్వాల్‌లోని మసాజ్ సెంటర్ పై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. వెల్నెస్ స్పా సెంటర్ బోర్డు పెట్టి లోపల నిర్వాహకులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా ముందస్తు సమాచారం రావడంతో ఎస్ఓటి పోలీసులు మసాజ్ సెంటర్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న ముగ్గురు ఆర్గనైజర్లు, నలుగురు యువతులు, ఇద్దరు విటులు సహా మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా మరోవైపు హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో రాయల్ స్పా సెంటర్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఇక్కడ పోలీసుల దాడుల్లో నలుగురు యువతులతో పాటు ఒక విటుడిని అరెస్టు చేశారు. స్పా సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసిన నలుగురు యువతులను తార్నాక హోమ్ కు తరలించారు. ఇక పోలీసుల అదుపులో ఉన్న వారి వివరాలు, స్పా సెంటర్ నిర్వాహకుల వివరాలు తెలియాల్సి ఉంది.