హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రంజాన్ వేళ ట్రాఫిక్ ఆంక్షలు
రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
By Srikanth Gundamalla Published on 10 April 2024 2:22 PM ISTహైదరాబాద్ వాసులకు అలర్ట్.. రంజాన్ వేళ ట్రాఫిక్ ఆంక్షలు
రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే పోలీసులు హైదరాబాద్ వాసులను అలర్ట్ చేశారు. వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. అంతేకాదు.. కొన్ని చోట్ల రూట్ మళ్లింపులు కూడా ఉంటాయని చెప్పారు.
మీరాలంమండి ఈద్గా, మాసబ్‌ట్యాంక్ హాకీ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రంజాన్ పండుగ సందర్బంగా ప్రత్యేక నమాజు దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి ఈద్గా వైపునకు వచ్చే వాహనాలను బహదూర్‌పురా క్రాస్ రోడ్స్ దాటి అనుతించరని పోలీసులు తెలిపారు. ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను జూపార్క్ ఓపెన్ ప్లేస్‌లో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పోలీసులు సూచించారు.
ఇక శివరాంపల్లి, దానమ్మహట్స్ వైపునకు వచ్చే వాహనాలను దానమ్మహట్స్ క్రాస్‌రోడ్స్ వైపు నుంచి ముందుకు వెళ్లనివ్వరి చెప్పారు. ఇలా వెళ్లాల్సిన వారికి మోడరన్ సా మిల్, మీరాలం ఫిల్టర్ బెడ్, సూఫీ కార్స్ వద్ద పార్కింగ్ స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. కాలాపత్తర్ వైపు నుంచి వచ్చే వాహనాలను మోచీ కాలనీ, బహదూర్‌పురా, శంషీర్‌గంజ్, నవాబ్ సాహెబ్‌కుంట వైపునకు పంపుతారు. ప్రార్థనలకు వచ్చే వారికి భయ్యా పార్కింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో స్థలం కేటాయించారు. పురానాపూల్ నుంచి బహదూర్‌పురా వైపునకు వెళ్లే బస్సులను జియాగూడ వైపునకు మళ్లిస్తారు. మాసబ్‌ట్యాంక్ హాకీ గ్రౌండ్‌లో ప్రార్థనలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయరం 8 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ కింద నుంచి వాహనాలను అనుమతించరు. వాహనాలు ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.