హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ప్రజలకు GHMC అధికారుల అలర్ట్
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ప్రజలకు GHMC అధికారుల అలర్ట్
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. అయితే.. నగర వ్యాప్తంగా మరో కొద్ది గంటల పాటు భారీ వర్షాలు పడుతూనే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, కూకట్‌పల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈదుగాలులతో భారీ వర్షం పడుతోంది. జగద్గిగిరిగుట్ట, బాలానగర్, మేడ్చల్, కీసర ఏరియాల్లోనూ భారీ వర్షం పడుతుంది. కొన్ని చోట్ల వడగండ్లు పడుతున్నాయి. కుత్బుల్లార్, మల్కాజిగిరి, ఆల్వాల్ ఏరియాల్లోనూ భారీ వర్షం పడుతుంది.
దాదాపుగా మరో రెండు గంటల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెబుతున్నారు. మరోవైపు ఈదురుగాలులు వీచే చాన్స్ ఉంది కాబట్టి.. ప్రజలు సేఫ్‌గా ఉన్న చోట్లలోనే ఉండాలని చెప్పారు. అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు.
ఉన్నట్లుండి వర్షం పడుతుండటంతో రోడ్లపైకి నీరు వచ్చి చేరుతోంది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు అధికారులు. ఇక వర్షపు నీళ్లు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్ హోల్స్ తెరిచి తెరిచి ఉంటాయని చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలన్నారు. మరోవైపు తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ చెప్పింది. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని పేర్కొంది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 16, 2024
జలమయం అయిన రోడ్లు pic.twitter.com/psz2qjVcuB