Hyderabad: పబ్‌లో డ్రగ్స్ కలకలం.. 24 మందికి పాజిటివ్
తెలంగాణలో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 7 July 2024 2:27 AM GMTHyderabad: పబ్‌లో డ్రగ్స్ కలకలం.. 24 మందికి పాజిటివ్
తెలంగాణలో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వాహన తనిఖీలు చేస్తూ.. కొన్ని ప్రాంతాల్లో రైడ్స్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. నగరంలోని ఖజాగూడ ది కేవ్ పఫ్ క్లబ్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో.. పబ్‌లో రైడ్స్ చేశారు. నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి తనిఖీలు చేశారు.
పబ్‌లో పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించిన అధికారులు వారికి టెస్టులు నిర్వహించారు. సుమారు 50 మందికి టెస్టులు నిర్వహించగా.. అందులో 24 మందికి డ్రగ్స్ తీసుకున్నారని పాజిటివ్‌గా తేలింది. దాంతో.. డ్రగ్స్ కలకలం రేపింది. అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో పబ్ నిర్వాహకులు, డీజే ఆపరేటర్లు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
ఈ మేరకు రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. 'పబ్‌లో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారం వచ్చింది. దాంతో దాడులు నిర్వహించాం. సుమారు 50 మందికి టెస్టులు నిర్వహించగా 24 మందికి పాజిటివ్‌గా తేలింది. వారిని అదుపులోకి తీఉకున్నాం. పబ్ నిర్వాహకులు, డీజే ఆపరేటర్లను ప్రధాన నిందితులుగా చేర్చాం. ఇందులో ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తాం. పబ్‌లో తనిఖీలు చేశాం ఎక్కడా ఏమీ దొరకలేదు. గంజాయి, మత్తు పదార్థాలను సేవించిన వాళ్లకూ టెస్టులు చేశాం' అని ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు.