మాస్క్ ధరించని వారిపై హైదరాబాద్ పోలీసుల కొర‌డా.. ఒక్క‌రోజే 832 మందిపై కేసులు

Hyderabad Police Take Serious Action Against Maskless People.హైదరాబాద్ నిన్న ఒక్కరోజే మాస్క్ ధరించని 832 మందిపై కేసులు నమోదు చేశామ‌ని రాచకొండ కమిషనర్

By Medi Samrat  Published on  14 April 2021 11:59 AM GMT
Hyderabad traffic police

తెలంగాణలో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఈ నేఫ‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం మాస్కు త‌ప్ప‌నిసరి చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. లేనిప‌క్షంలో మాస్క్ ధరించని వారిపై కేసులు నమోదు చేయ‌డంతో పాటు.. రూ. 1000 జరిమానా ఉంటుంద‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో హెచ్చరించింది.

ఈ నేఫ‌థ్యంలో నిన్న ఒక్కరోజే మాస్క్ ధరించని 832 మందిపై కేసులు నమోదు చేశామ‌ని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. అలాగే.. కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా మాస్కులు లేని వారిని గుర్తించి, కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తామని మహేశ్ భగవత్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా వేగంగా విస్తరిస్తోందని, ప్రజలందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీసులు కూడా ప్రధాన కూడళ్లలో కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఇదిలావుంటే.. కరోనా పేషెంట్లకు హైదరాబాద్ ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు కూడా దొరకని పరిస్థితి ఆందోళనను పెంచుతోంది. ఈ నేపథ్యంలో కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు నగర పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.
Next Story
Share it