GHMC పరిధిలో రూ.37లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత

దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసులు ప్రటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  2 May 2024 1:45 PM IST
hyderabad, police,  rs.37 lakh,  liquor,

GHMC పరిధిలో రూ.37లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత  

దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసులు ప్రటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా డబ్బు, మద్యం సహా ఇతర వస్తువులను అక్రమంగా తరలిస్తే వాటిని వెంటనే సీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేస్తున్నారు. తాజాగా GHMC పరిధిలో అక్రమంగా తరలిస్తున్న తరలిస్తున్న మద్యాన్ని సీజ్‌ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసులు సీజ్‌ చేశారు.

ఎన్నికల సందర్భంగా మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకే పోలీసులు చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేస్తున్నారు. బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిబంధలనకు వ్యతిరేకంగా తరలిస్తున్న రూ.21.53 లక్షల విలువైన 2,597 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు. ఇక పేట్‌బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న రూ.15.46 లక్షల విలువైన 1.916 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. బాలానగర్‌ ఎస్‌వోటీ టీమ్‌, కేపీహెచ్‌బీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే రేడియంట్‌ మనీ లాజిస్టిక్ వాహనంలో నిబంధనలు అతిక్రమించి ఎలాంటి క్యూఆర్ కోడ్‌ లేకుండా రూ.1,24,626 నగదుని తీసుకెళ్తుండగా సీజ్‌ చేశారు. ఎస్‌వోటీ బృందం అరెస్ట్ చేసిన నిందితులను, మద్యం సీసాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా బాచుపల్లి, పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ల పరిధిలో దాదాపు 4వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. దీని విలువ రూ.37లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

Next Story