Hyderabad: న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
న్యూయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 5:45 PM ISTHyderabad: న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
న్యూయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు సన్నాహాలు చేస్తున్నారు పోలీసులు. అలాగే డ్రగ్స్ రవాణాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా జరగకుండా ముందస్తుగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ముందస్తు చర్యలతో పాటు న్యూఇయర్ వేడుకలపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
న్యూయర్ వేడుకలకు రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు పోలీసులు. తర్వాత ఎలాంటి పార్టీలు నిర్వహించడానికి వీలులేదని చెప్పారు. అయితే.. న్యూఇయర్ వేడుకలకు ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు. అలాగే ఈవెంట్ నిర్వాహకులు సీసీ కెమెరాలను తప్పకుండా వాడాలని చెప్పారు. ఈవెంట్ నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీని నియమించుకోవాలని పోలీసులు సూచించారు. అశ్లీల నృత్యాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అలాగే 45 డేసిబుల్స్ శబ్ధం కంటే మించొద్దని సూచించారు. పెద్ద సౌండ్లు పెట్టి స్థానికంగా ఉండేవారిని.. సాధారణ జనాలకు ఇబ్బందులు కలిగించొద్దని చెప్పారు.
అలాగే ఈవెంట్ నిర్వాహకులు కెపాసిటీకి మించి పాస్‌లు కూడా ఇవ్వొద్దని చెప్పారు. ఇక ఈవెంట్‌కు వచ్చే వారి కోసం అన్ని సదుపాయాలు కల్పించి ఇబ్బందులు కలగకుండా చూసుకోవానలి చెప్పారు. లిక్కర్ ఈవెంట్స్‌లో మైనర్లను అనుమతించొద్దని పోలీసులు సూచించారు. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయొద్దని చెప్పారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా రూ.10వేల జరిమానాతో పాటు.. ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందని చెప్పారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెన్షన్ అవుతుందని చెప్పారు. ఈమేరకు న్యూఇయర్ వేడుకలు నిర్వహించే వారు.. పాల్గొనే వారికి పలు సూచనలు చేస్తూ పోలీసులు ఆంక్షలు విధించారు.