Hyderabad: గణేష్ నిమజ్జన ఊరేగింపులో డీజేలకు నో పర్మిషన్.. పోలీసుల నిబంధనలు

వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  13 Sep 2024 9:30 AM GMT
Hyderabad: గణేష్ నిమజ్జన ఊరేగింపులో డీజేలకు నో పర్మిషన్.. పోలీసుల నిబంధనలు

వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్‌లో గల్లీకో వినాయకుడు ఉన్నాడు. నిమజ్జనాలకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రంలోనే హైదరాబాద్ సిటీ పోలీసులు నిమజ్జనాల నిర్వహణపై పలు కీలక నిబంధనలు పెట్టారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో ఈ రూల్స్ పెట్టారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు చెప్పారు. నిమజ్జనం రోజున సౌత్ జోన్ పరిధుల నుంచి విగ్రహాలను తీసుకెళ్లేవారు ముందుగానే బయలుదేరాలని, వాహనానికి ఏసీపీ కేటాయించిన నంబర్‌ను ప్రదర్శించాలని తెలిపారు.

నిమజ్జనాల వేళ పోలీసుల మరిన్ని సూచనలు:

విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్‌ను అమర్చకూడదు

ఒక గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతి ఉంటుంది

నిమజ్జనం రోజు వాహనాలపై డీజేతో మ్యూజికల్ సిస్టమ్‌కు అనుమతి లేదు

రంగులు చల్లుకునేందుకు కాన్ఫెట్టి తుపాకులను ఉపయోగించకూడదు

విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా మరేదైనా మత్తుమందులు సేవించిన వ్యక్తులకు అనుమతి ఉండదు

రోడ్డుపై వాహనం వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ను ప్రభావితం చేయకూడదు

ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకూడదు

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా మార్గంలో ఆపకూడదు

పోలీసు అధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు వాహనాల కదలికలు ఆధారపడి ఉంటాయి

ఊరేగింపులో ఎవరూ ఆయుధాలు, మండే పదార్థాలు లేదా ఇతర ఆయుధాలను తీసుకెళ్లకూడదు

ఊరేగింపులో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు/రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు

ఏ వర్గానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడొద్దు

ఊరేగింపు సమయంలో బాణాసంచా ఉపయోగించకూడదు

Next Story