Hyderabad: నకిలీ ఈ - చలాన్‌లు.. పౌరులను అలర్ట్ చేసిన పోలీస్ డిపార్ట్‌మెంట్
హైదరాబాద్: సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, నకిలీ ఈ-చలాన్ (e-Challan) చెల్లింపు లింకులు ద్వారా జరుగుతున్న...
By - అంజి |
Hyderabad: నకిలీ ఈ - చలాన్‌లు.. పౌరులను అలర్ట్ చేసిన పోలీస్ డిపార్ట్‌మెంట్
హైదరాబాద్: సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, నకిలీ ఈ-చలాన్ (e-Challan) చెల్లింపు లింకులు ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలపై హెచ్చరిక జారీ చేసింది. తెలియని సైబర్ నేరగాళ్లు “మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి” అంటూ SMS లేదా WhatsApp సందేశాల ద్వారా నకిలీ లింకులను పంపిస్తూ, వెంటనే చెల్లింపు చేయాలని ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొంది.
ఈ నకిలీ లింకులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల మాదిరిగా కనిపించేలా రూపొందించబడి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ లింకులపై క్లిక్ చేసిన తర్వాత, బాధితులను వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయమని అడుగుతారని, అనంతరం చెల్లించాల్సిన మొత్తం చూపించి, చెల్లింపు చేయగానే బాధితుల మొబైల్ ఫోన్లలో మాల్వేర్ ఇన్‌స్టాల్ కావడం లేదా బ్యాంకింగ్ వివరాలు హ్యాక్ కావడం జరుగుతూ, అనధికార లావాదేవీలు జరుగుతున్నాయని హెచ్చరించింది.
ప్రజలకు సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ సూచనలు:
- ట్రాఫిక్ చలాన్ చెల్లింపులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చేయాలి.
- SMS, WhatsApp లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దు
- ప్రభుత్వ శాఖలు WhatsApp లేదా వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింకులు పంపవు.
- OTP, UPI పిన్, డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు లేదా వ్యక్తిగత సమాచారంను ధృవీకరణ లేని వెబ్‌సైట్లలో నమోదు చేయవద్దు.
- మొబైల్ యాప్‌లను అధికారిక యాప్ స్టోర్ల నుంచే డౌన్‌లోడ్ చేయాలి.
- మీ మొబైల్ ఫోన్‌లో తాజా సెక్యూరిటీ అప్‌డేట్లు మరియు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉండేలా చూసుకోండి.
సైబర్ మోసానికి గురైతే:
బాధితులు వెంటనే:
- మొబైల్ డేటా / Wi-Fiను నిలిపివేయాలి.
- తమ బ్యాంకును సంప్రదించి కార్డులు / లావాదేవీలను బ్లాక్ చేయించాలి.
- 1930 నంబర్‌కు కాల్ చేయాలి.
- www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి.
- సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి.