Hyderabad: అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తుల తయారీ.. గుట్టురట్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలోని కేడీ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర వాతావరణంలో నడుపుతున్న ఒక అక్రమ బేకరీ తయారీ...
By - అంజి |
Hyderabad: అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తుల తయారీ.. గుట్టురట్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలోని కేడీ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర వాతావరణంలో నడుపుతున్న ఒక అక్రమ బేకరీ తయారీ యూనిట్‌ను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ జోన్), గుడిమల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో సుమారు ₹12,54,280 విలువైన బేకరీ ఉత్పత్తులు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ యూనిట్‌ను నడుపుతున్న అహ్మద్ రజా (46) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉస్మానియా బిస్కెట్లు, రస్క్, బటర్ బన్స్, కాజూ బిస్కెట్లు వంటి ఉత్పత్తులను ఇతను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను వాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వీటిని స్థానిక కిరాణా షాపులు, కేఫ్‌లు మరియు హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.
దాడి సమయంలో పోలీసులు భారీ ఎత్తున ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మైదా, చక్కెర, రిఫైన్డ్ పామాయిల్ తో పాటు వందలాది బాక్సుల బిస్కెట్లు, బన్స్ ఉన్నాయి. అలాగే ఓవెన్లు, స్పైరల్ మిక్సర్లు, షీటర్ మెషీన్లు మరియు ఇంధనంగా వాడుతున్న సుమారు 10 టన్నుల చెక్క కర్రలను కూడా సీజ్ చేశారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ ఆహార తయారీ కేంద్రాలపై తమ నిఘా కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు.
#Hyderabad:Illegal #bakery unit busted in #Gudimalkapur | ₹12.54 lakh goods seized@hydcitypolice Task Force (#Golconda) & Gudimalkapur Police raided an #unlicensed bakery unit in #KDColony, arresting one accused, Ahmed Raza (46).Manufactured #biscuits, #buns & other items… pic.twitter.com/IWPJ6Fy0ug
— NewsMeter (@NewsMeter_In) March 28, 2026