Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ మరో మూడ్రోజులు పొడిగింపు

హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగే నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు ఎంతో ప్రత్యేక ఉంది.

By Srikanth Gundamalla  Published on  12 Feb 2024 8:20 PM IST
hyderabad, numaish exhibition, date extended,

 Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ మరో మూడ్రోజులు పొడిగింపు 

హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగే నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు ఎంతో ప్రత్యేక ఉంది. ఈ ఎగ్జిబిషన్‌లో ఎన్నో రకాల వస్తువులు దొరుకుతాయి. కాగా.. హైదరాబాదీలకు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎగ్జిబిషన్‌ను మరో మూడ్రోజుల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ వరకు ఎగ్జిబిషన్‌ కొనసాగనుంది. వాస్తవానికి అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈ నెల 15వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే.. ముగింపు సమయం దగ్గర పడుతున్నా.. రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దాంతో.. జనాల ఇంట్రెస్ట్‌ను దృష్టిలో పెట్టుకున్న నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడ్రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. కాగా.. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన ప్రారంభం అయ్యే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15వ తేదీన ముగుస్తుంది. ఈసారి మాత్రం స్పెషల్‌గా మూడ్రోజులు గడువుని పెంచారు. ఎగ్జిబిషన్‌ నిర్వాహకుల నిర్ణయంతో హైదరబాదీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story