హైద‌రాబాద్ మెట్రో వేళ్ల‌ల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే..

Hyderabad metro rail reschedules timings.తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మ‌రో 10 రోజులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2021 1:34 AM GMT
హైద‌రాబాద్ మెట్రో వేళ్ల‌ల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మ‌రో 10 రోజులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం 1 గంట వ‌ర‌కు స‌డ‌లింపులు ఇచ్చారు. దీంతో హైద‌రాబాద్ మెట్రో స‌ర్వీసుల స‌మ‌యాన్ని మార్చారు. ఈ మేర‌కు రీ షెడ్యూల్ స‌మ‌యాన్ని హైద‌రాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్ర‌క‌టించింది. లాక్ డౌన్ కాలంలో మొదటి రైలు టెర్మినల్ స్టేషన్ నుంచి ఉదయం 7:00 గంటలకు బయలుదేరనుంది. చివరి రైలు ఉదయం 11:45 వరకే ఉంటుందని ప్రకటించారు.

ఈ రైలు మధ్యాహ్నం 12:45 గంటల కల్లా సంబంధిత చివరి టెర్మినేషన్ స్టేషన్‌కు చేరుకుంటుంది. అంద‌రి భద్రత కోసం.. ప్రయాణికులు సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, క్రమంగా హ్యాండ్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ వంటి కోవిడ్-19 భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని మెట్రో రైలు సంస్థ సూచించింది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నాలలో భద్రతా సిబ్బంది, హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బందితో సహకరించాలని అభ్యర్థించారు.


Next Story