అటెన్షన్ ప్లీజ్.. రూ.59తో మెట్రో రైల్‌లో అపరిమిత ప్రయాణం
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికుల కోసం 'సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్' పేరుతో అద్బుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది.
By Srikanth Gundamalla Published on 11 Aug 2023 6:00 PM ISTఅటెన్షన్ ప్లీజ్.. రూ.59తో మెట్రో రైల్‌లో అపరిమిత ప్రయాణం
హైదరాబాద్ మెట్రో రైల్‌ను నగరవాసులు బాగా ఆదరిస్తున్నారు. ట్రాఫిక్‌లో ఇబ్బంది పడేకంటే ఎంచక్కా మెట్రోలో వెళ్లడమే మేలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో రోజురోజుకు మెట్రో రైల్‌లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ మెట్రో కూడా ప్రయాణికులను ఆకర్షించేలా వివిధ ఆఫర్లను తీసుకొస్తుంది. తాజాంగా మరో ఆఫర్‌ను ప్రకటించింది హైదరాబాద్ మెట్రో రైల్. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రవేశపెడుతోంది.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికుల కోసం 'సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్' పేరుతో అద్బుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కేవలం రూ.59తో సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డును రీచార్జ్ చేయడం ద్వారా మూడ్రోజుల పాటు అపరిమిత మెట్రో రైడ్‌లను అస్వాదించవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. ఈ ఆఫర్‌ను ఆగస్టు 12, 13, 15 మాత్రమే తేదీల్లో అస్వాదించవచ్చని అధికారులు ఒక ప్రకటనలో వివరించారు. ఆగస్టు 15న దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, మెట్రో రైల్ ఇప్పటికే విద్యార్థులకు కూడా స్టూడెంట్ పాస్ ఆఫర్‌ను ప్రకటించింది. అంతేగాక, మెట్రో రైల్ కోచ్‌లనూ పెంచే అవకాశం ఉంది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని మెట్రో రైల్ అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని ప్రోత్సహించడం ద్వారా.. నగర అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తామని అధికారులు తెలిపారు. పర్యావరణ స్పృహతో కూడిన భవిష్యత్తుకు హైదరాబాద్ మెట్రో రైలు ఎల్లప్పుడూ తోడ్పడుతుందని ప్రకటించారు.
ఇక ఈ సందర్భంగా ఎల్‌టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ ఎండీ & సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడారు. విలువైన కస్టమర్లకు ఈ ప్రత్యేకమైన ఎస్‌ఎస్‌ఎఫ్ ఆఫర్‌ను అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ ఆఫర్ ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ఈ ఆఫర్‌ను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కేవీబీ రెడ్డి కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు సౌకర్యాన్ని వినిగించుకోవాలనీ.. ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామని అని కేవీబీ రెడ్డి అన్నారు.