హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) జనవరి 19 ఆదివారం నాడు నగరం యొక్క రెండవ దశ మెట్రో విస్తరణకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ప్రకటించింది. మియాపూర్ నుండి పటాన్‌చెరు వరకు 13.4 కి.మీ దూరంలో 10 స్టేషన్లు ఉండనున్నాయి. ప్రతిపాదిత స్టేషన్లలో పటాన్‌చెరు, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, మదీనాగూడ, చందా నగర్, జ్యోతి నగర్, బీహెచ్‌ఈఎల్, ఆర్‌సి పురం, బీరంగూడ ఉన్నాయి.
ఈ మెట్రో విస్తరణ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, మెరుగైన కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ స్థానాలు, పేర్లు తాత్కాలికమైనవి. అవి తర్వాత మారవచ్చు. ఇంకా ఈ విస్తరణ హైదరాబాద్ మెట్రో యొక్క కనెక్టివిటీని పటాన్‌చెరు నుండి హయత్‌నగర్ వరకు మొత్తం 50 కి.మీ.లు ఉంటుంది. ఎల్‌బీ నగర్ నుంచి హయత్ నగర్‌ను కలుపుతూ హైదరాబాద్ రెండో దశ మెట్రో విస్తరణ పనులకు సంబంధించి రూట్ మ్యాప్‌ను గతంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రకటించింది.