గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్ టు హయత్‌నగర్‌ వరకు మెట్రో రైలు

ఎల్బీనగర్ నుంచి హయత్‌ నగర్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.

By Srikanth Gundamalla  Published on  12 July 2024 7:39 AM IST
Hyderabad, metro, lb nagar,  hayathnagar,

గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్ టు హయత్‌నగర్‌ వరకు మెట్రో రైలు

హైదరాబాద్‌ వాసులకు మరో గుడ్‌న్యూస్‌ అందింది. ఇప్పటికే ట్రాఫిక్‌ ఇబ్బందులు పడుతున్నవారికి మెట్రో అందుబాటులో ఉంది. ఇక రెండో దశ విస్తరణలో భాగంగా ఎల్బీనగర్ నుంచి హయత్‌ నగర్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 7 కి.మీ మేర ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మార్గంలో మొత్తం 6 స్టేషన్లు ఉండబోతున్నాయి. సగటున కిలోమీటరకు ఒక స్టేషనుని ప్రతిపాదించారు. విజయవాడ జాతీయ రహదారి కావడంతో కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది. దాంతో.. మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసకుంటున్నారు అధికారులు.

రహదారికి రెండు వైపుల నుంచి మెట్రో స్టేషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకునేందుకు వీలుగా వాటి స్థానాలను సర్దుబాటు చేస్తున్నారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీతో డీపీఆర్ రూపకల్పనకు మెట్రో రైలు అధికారులు తుదిరూపు ఇచ్చారు. రెండో దశ విస్తరణలో వేర్వేరు మార్గాల్లో 70 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న కారిడార్-1కు పొడిగింపు అయిన ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ మార్గం ఒకటి. ఈ మార్గంలో చింతల్‌కుంట వద్ద ఒక స్టేషన్‌ ఏర్పాటుచేయనున్నారు. ఎల్బీనగర్‌ నుంచి చింతల్‌కుంట వరకు మధ్యలోరు మెట్రోరైలు మార్గం ఉంటుంది. మిగతా ఐదు స్టేషన్లు ఎక్కడెక్కడ అనేది త్వరలోనే స్పష్టత రానుంది.

Next Story