హైదరాబాద్‌లో మసాజ్ సెంటర్లపై దాడులు, 34 మంది అరెస్ట్

హైదరాబాద్‌లోని పలు చోట్ల మసాజ్‌ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్, వెస్ట్‌ జోన్ బృందం అధికారులు దాడులు చేశారు.

By Srikanth Gundamalla
Published on : 15 July 2023 6:56 AM IST

Hyderabad, Massage Centre, 34 Arrest,

హైదరాబాద్‌లో మసాజ్ సెంటర్లపై దాడులు, 34 మంది అరెస్ట్

హైదరాబాద్‌లోని పలు చోట్ల మసాజ్‌ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్, వెస్ట్‌ జోన్ బృందం అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 34 మందిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లోని పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని అక్రమంగా మసాజ్‌ సెంటర్లు నిర్వహిస్తుండటంతో.. సమాచారం అందుకుని దాడి చేశారు అధికారులు. ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్‌, వెస్ట్‌ జోన్‌ బృందం అధికారులు ఉమ్మడిగా పాల్గొన్నారు.. జీఎహెచ్‌ఎంసీ నుంచి లైసెన్స్‌ పొందడం, ప్రొఫెషనల్‌ థెరపిస్ట్‌లు లేకపోవడం, సీసీటీవీ కెమెరాలు డీవీఆర్ లేకపోవడాన్ని గమనించారు పోలీసులు. ఇక మసాజ్‌ రూముల్లో కూడా సీసీటీవీలు లేకపోవడంతో చర్యలు తీసుకున్నారు. నిబంధనలు పాటించనందుకు ఆయా మసాజ్‌ సెంటర్ల నుంచి 34 మందిని అదుపులోకి తీసుకున్నారు.

చాలా మసాజ్‌ సెంటర్లలో క్రాస్ మసాజ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పాలో అర్హత ఉన్న వైద్యులు, ఫిజియోథెరపిస్టులు లేరని, కస్టమర్ల ఎంట్రీ రిజిస్ట్రార్‌ కూడా నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. మొత్తం పది మసాజ్ సెంటర్లపై దాడులు చేయగా.. 34 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. అరెస్ట్‌ చేసిన వారిని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్‌ఆర్‌నగర్, పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇక ఆయా మసాజ్‌ సెంటర్లలో నిబంధనల ఉల్లంఘణపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story