Hyderabad: 'మనయాత్రి' యాప్‌.. జీరో కమిషన్‌తో క్యాబ్ సేవలు

హైదరాబాద్‌లో తొలిసారిగా జీరో కమిషన్ ఆధారిత ఆటో క్యాబ్‌ యాప్‌ 'మనయాత్రి'ని ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on  1 March 2024 1:01 AM GMT
hyderabad, mana yatri, app,  cabs,

Hyderabad: 'మనయాత్రి' యాప్‌.. జీరో కమిషన్‌తో క్యాబ్ సేవలు

తెలంగాణ హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. ఎన్నో చూడాల్సిన ప్రదేశాలు.. కట్టడాలు ఈ భాగ్యనగరంలో ఉన్నాయి. అలాగే ఆఫీసులు కూడా ఎక్కువే. నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో క్యాబ్‌లకు మంచి గిరాకీ ఉంటుంది. తాజాగా హైదరాబాద్‌లో తొలిసారిగా జీరో కమిషన్ ఆధారిత ఆటో క్యాబ్‌ యాప్‌ 'మనయాత్రి'ని ప్రారంభించారు. టీహబ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు, డ్రైవర్ల యూనియన్ల సభ్యులు, సాంకేతిక నిపుణులు పలువురు పాల్గొన్నారు.

డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాదు.. ఈ యాప్‌ ద్వారా నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఓపెన్ నెట్వర్‌ డిజిటల్ కామర్స్‌లో భాగమైన ఈ యాప్‌ బెంగళూరులోని టీహబ్‌లో రూపొందించారు. బెంగళూరులో 'నమ్మ యాత్ర' పేరుతో యాప్‌ను ప్రారంబించగా.. అక్కడ ఈ యాప్‌కు మంచి ప్రజాదరణ లభించింది. దాంతో.. హైదరాబాద్‌ నగరంలో కూడా దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌ టీ-హబ్‌లోని బృందం నుంచి ఇన్‌ పుట్స్‌, సపోర్ట్‌ తో అదే సంస్థ ఈ యాప్‌ను ఇక్కడా రూపొందించింది.

హైదరాబాద్‌లో యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా ఓఎన్‌డీసీ సీఈవో టీకోషి మాట్లాడారు. హైదరాబాద్‌ నగర సంస్కృతి, ఇక్కడి సాంకేతికత నిపుణులకు 'మనయాత్రి' యాప్‌ సరిగ్గా సరిపోతుందని చెప్పారు. హైదరాబాద్‌ ప్రజలకు సరసమైన, సౌకర్యవంతమైన రవాణాను అందుతుందని చెప్పారు. అంతేకాదు..డ్రైవర్ల సంపాదనను మరింతగా పెంచడానికి సాధికారత కల్పించడానికి ఇది దోహదం చేయనుందని టీకోషి చెప్పారు. సమీకృత ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందన్నారు. ఈ యాప్‌ సమీకృత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మరో అధికారి మాట్లాడుతూ.. మనయాత్రి ఇప్పటికే హైదరాబాద్‌లో 25వేల మందికి పైగా డ్రైవర్లను చేర్చుకుందనీ చెప్పారు. రాబోయే 3 నెలల్లో మరో లక్షల మందిని చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్టన్లు వెల్లడించారు. వివరాలకు www.naamyatri.inను సంప్రదించాలని పేర్కొన్నారు.

Next Story