దారుణం.. అనుమానంతో భార్య, బిడ్డను చంపి భర్త ఆత్మహత్య

సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిన్‌పల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla
Published on : 21 July 2024 9:15 AM IST

hyderabad, man, murder,  wife, ten months daughter,

దారుణం.. అనుమానంతో భార్య, బిడ్డను చంపి భర్త ఆత్మహత్య 

సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిన్‌పల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి ఒడికట్టాడు. ఈ విషయంలో భార్యతో తరచూ గొడపవడేవాడు. ఉన్నట్లుండి శనివారం భార్యతో పాటు పది నెలల వయసున్న చిన్నారిని చంపేశాడు.

బోయిన్‌పల్లిలో స్వప్న, గణేశ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 10 నెలల వయస ఉన్న నక్షత్ర అనే కూతురు ఉన్నది. అయితే భార్యపై అనుమానంతో స్వప్న, కూతురు నక్షత్రను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత గణేశ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేట రైల్వేట్రాక్‌పై సూసైడ్ చేసుకున్నాడు. ఇక గణేశ్‌ మరణం తర్వాత .. అతని నివాసానికి వెళ్లి చూడగా ఈ ఉదంతం బయటపడింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే.. భార్యపై అనుమానంతోనే భర్త గణేశ్‌ స్వప్నతో పాటు కూతురుని కూడా చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story