పోలీసులను దూషించిన యువకుడికి 20 రోజుల జైలు శిక్ష

హైదరాబాద్‌లో పోలీసులను దూషించిన ఓ యువకుడికి కోర్టు షాక్‌ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  2 Sept 2023 2:45 PM IST
Hyderabad, man, police, 20 days, jail,

పోలీసులను దూషించిన యువకుడికి 20 రోజుల జైలు శిక్ష

హైదరాబాద్‌లో పోలీసులను దూషించిన ఓ యువకుడికి కోర్టు షాక్‌ ఇచ్చింది. విధుల్లో ఉన్న పోలీసులను అసభ్యంగా దూషించినందుకు గాను 20 రోజుల పాటు జైలు శిక్షను విధించింది.

అసలు ఏమైందంటే..

నారాయణగూడలో గత రెండ్రోజుల క్రితం ప్రణవ్ అనే యువకుడు తన పెంచుకుంటున్న రెండు ఇంపోర్టెడ్‌ కుక్కలను తీసుకుని రోడ్డుమీదకు వచ్చాడు. రోడ్డుపై వెళ్తుండగా.. అప్పుడే అటుగా వచ్చిన పోలీస్‌ పెట్రోలింగ్ వాహనం అనుకోకుండా రెండు కుక్కల్లో ఒకదానిని ఢీకొట్టింది. దాంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రణయ్‌ పోలీసులపై విరుచుకుపడ్డాడు. దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాదు.. అసభ్య పదజాలంతో నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించాడు. పోలీసులు నానా మాటలు అన్నాడు. అతుడు రోడ్డుపై నిలబడి నానా హంగామా చేయడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇతర వాహనదారులకూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎంత సేపటికీ ఆ యువకుడు వెనక్కి తగ్గకుండా పోలీసులను దూషిస్తూ.. రోడ్డుపై రచ్చ చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. కుక్కకు ఎలాంటి గాయం కాలేదని.. బాగానే ఉందని సమాచారం. ఇక యువకుడు నానా హంగామా చేస్తుండగా వాహనాదారులు, పోలీసులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

రోడ్డుపై నానా హంగామా చేసిన ప్రణవ్‌పై పోలీసులు న్యూసెన్స్‌ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సదురు యువకుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు యువకుడికి షాక్‌ ఇచ్చేలా తీర్పునిచ్చింది. పోలీసులను దూర్భాషలాడుతూ.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు ప్రణవ్‌కు 20 రోజుల పాటు జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు.

Next Story