Hyderabad: మహిళా స్నేహితురాలిని ఫ్లాట్‌కు పిలిచాడని.. అపార్ట్‌మెంట్‌ సెక్రటరీ నోటీసు

హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న యువకుడికి, తన మహిళా సహోద్యోగిని ఫ్లాట్‌కు ఆహ్వానించినందుకు అపార్ట్‌మెంట్ అసోసియేషన్ నోటీసు జారీ చేసింది.

By -  అంజి
Published on : 24 Feb 2026 7:51 AM IST

Hyderabad Apartment Dispute, Reddit Hyderabad Community, Moral Policing in Apartments, Apartment Association Notice, Legal Rights of Tenants, Bachelor Restrictions in Gated Communities

Hyderabad: మహిళా స్నేహితురాలిని ఫ్లాట్‌కు పిలిచాడని.. అపార్ట్‌మెంట్‌ సెక్రటరీ నోటీసు     

హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న యువకుడికి, తన మహిళా సహోద్యోగిని ఫ్లాట్‌కు ఆహ్వానించినందుకు అపార్ట్‌మెంట్ అసోసియేషన్ నోటీసు జారీ చేసింది. ఈ వింత అనుభవాన్ని సదరు యువకుడు 'Reddit' వేదికగా పంచుకోవడంతో ఇది పెద్ద చర్చకు దారితీసింది. సదరు యువకుడు గత నెలలో తన మహిళా సహోద్యోగిని రెండు మూడు సార్లు టీ, స్నాక్స్, డిన్నర్ కోసం తన ఫ్లాట్‌కు ఆహ్వానించాడు. దీనివల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగలేదని, పెద్దగా మ్యూజిక్ పెట్టడం లేదా గొడవ చేయడం వంటివి జరగలేదని అతను స్పష్టం చేశాడు.

కానీ, అపార్ట్‌మెంట్ సెక్రటరీ పంపిన నోటీసులో ఇలా ఉంది. "కొందరు నివాసితులు మహిళా సహోద్యోగులను తమ ఫ్లాట్లకు పిలుస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఇది అపార్ట్‌మెంట్ నిబంధనలకు విరుద్ధం." ఇలాంటి 'తప్పులను' యాజమాన్యం సహించదు. మరోసారి రిపీట్ అయితే వెంటనే ఫ్లాట్ ఖాళీ చేయించాల్సి ఉంటుంది."

నెటిజన్ల రియాక్షన్:

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అపార్ట్‌మెంట్ అసోసియేషన్ తీరుపై మండిపడుతున్నారు. అపార్ట్‌మెంట్ బైలాస్ దేశ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అతిక్రమించలేవని పలువురు అభిప్రాయపడ్డారు. అద్దె ఒప్పందంలో ఇటువంటి ఆంక్షలు ముందుగా పేర్కొనకపోతే, అసోసియేషన్ ఇలాంటి నోటీసులు ఇవ్వడం చెల్లదని కొందరు సూచించారు. అసోసియేషన్‌కు రిటర్న్ లెటర్ రాసి, అటువంటి నిబంధనలు ఎప్పుడు ఆమోదించారో అడగాలని, నిబంధనల కాపీని కోరాలని ఒక యూజర్ సలహా ఇచ్చారు. పెద్ద గేటెడ్ కమ్యూనిటీలలో ఇటువంటి "మోరల్ పోలీసింగ్" (Moral Policing) ఎక్కువైపోయిందని, అందుకే తాము విడిగా ఉండే అపార్ట్‌మెంట్లనే ఎంచుకుంటామని మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు.

Next Story