ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
By Srikanth Gundamalla Published on 15 March 2024 5:49 AM GMTఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ముస్లింలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
* ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వద్దగా వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు.
* బషీర్‌బాగ్ నుంచి ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా వెళ్లే వాహనాలను బిజెఆర్ విగ్రహం మీదుగా ఎస్‌బిహెచ్, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు వెళ్లాలి.
* సుజాతా స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ మీదుగా వచ్చే వాహనాలు సూజాతా స్కూల్ జంక్షన్ మీదుగా నాంపల్లి వైపు మళ్లిస్తారు.
ఇక పంజాగట్ట, వీవీ స్టాట్యూ, రాజీవ్‌గాంధీ స్టాట్యూ, నిరంకారీ, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్, లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతీ, బషీర్‌బాగ్, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, అబిడ్స్ సర్కిల్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్‌గూడ జంక్షన్లు రద్దీగా ఉండనున్నాయి. ఆర్టీసీ బస్సులు రవీంద్ర భారతి మీదుగా బీజేఆర్ స్టాట్యూ నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎల్బీ స్టేడియం మెయిన్ గేట్ నుంచి వెళ్లొద్దని సూచించారు పోలీసులు. ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ ముందు నుంచి ఏఆర్ పెట్రోల్ పంప్ మీదుగా నాంపల్లి వైపు మళ్లాలి.