Hyderabad: ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు
TSLPRB ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు,
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 11:00 AM ISTHyderabad: ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 14, 2024న LB స్టేడియంలో నియామక ఉత్తర్వులు జారీ చేయనున్న దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేస్తున్నారు. సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఫిబ్రవరి 14న ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.
నేడు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎల్బీ స్టేడియంలో అపాయింట్ మెంట్ లెటర్లను సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారు. సాయంత్రం 4 గంటలకు 15,750 మందికి నియామక పత్రాలను సీఎం అందించనున్నారు. సివిల్, ఏఆర్, ఎక్సైజ్ సహా ఇతర విభాగాల్లో కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంపికయ్యారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. ఎఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ స్టాచ్యూ మీదుగా వచ్చే వాహనాలను ఎఆర్ పెట్రలో పంప్ మీదుగా నాంపల్లి వైపు మళ్లించనున్నారు. బషీర్ బాగ్ నుంచి ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా వెళ్లే వాహనాలను పీజేఆర్ విగ్రహం మీదుగా ఎస్బీహెచ్, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. సుజాతా స్కూల్ లైన్ నుంచి వచ్చే వాహనాలను సుజాతా స్కూల్ జంక్షన్ మీదుగా నాంపల్లి వైపు మళ్లించనున్నారు. వాహనదారులు పంజాగుట్ట, లక్డీ కపూర్, రవీంద్రభారతి, బషీర్ బాగ్, గన్ ఫౌండ్రీ ఎస్బీఐ, అబిడ్స్ సర్కిల్, నాంపల్లి, హిమాయత్ నగర్, అసెంబ్లీ, ఎంజేమార్కెట్, హైదర్ గూడ జంక్షన్లు రద్దీగా ఉండే చాన్స్ ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని.. ట్రాఫిక్ పోలీసులు కోరారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.