జూబ్లీహిల్స్‌లో గీతా ఆర్ట్స్‌ ఆఫీసు దగ్గర కారు ప్రమాదం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  8 July 2023 8:52 AM IST
Hyderabad, Jublihills, Car accident ,

జూబ్లీహిల్స్‌లో గీతా ఆర్ట్స్‌ ఆఫీసు దగ్గర కారు ప్రమాదం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్‌ నెంబర్ 45లో గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదురుగా కారు అతివేగంగా దూసుకొచ్చింది. అదుపుతిప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో కారు పల్టీ కొట్టింది. ప్రమాదంలో కారు బోల్తా పడగా.. అందులో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు చెప్పారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా.. రోడ్డుపై కారు బోల్తా కొట్టడంతో కాసేపు వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మద్యం సేవించి డ్రైవర్ కారు నడిపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు.

Next Story