హైదరాబాద్: మాదాపూర్‌లోని ఒక హాస్టల్ యజమానిని ఆగస్టు 16, శనివారం నాడు ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై ఆ విద్యార్థిని కుటుంబం దాడి చేసింది. డెక్కన్ క్రానికల్ నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తిని సత్య ప్రకాష్ గా గుర్తించారు. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఒక బాలికతో అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు హాస్టల్‌కు వెళ్లి అతనిపై దాడి చేసినట్లు సమాచారం.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ విద్యార్థిని బంధువులు కుర్చీలు విసిరేసి ఫర్నిచర్ పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి. నిందితుడిపై బాలిక బంధువులు దాడి చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు అల్లరి మూక నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. తరువాత, అతన్ని పోలీసులు కారులో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.