25 పబ్‌లలో పోలీసుల తనిఖీలు, 50 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ

తెలంగాణలో పోలీసులు డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

By Srikanth Gundamalla  Published on  18 Aug 2024 12:30 PM IST
Hyderabad, excise enforcement, raid,  pubs, drug tests,

25 పబ్‌లలో పోలీసుల తనిఖీలు, 50 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ

తెలంగాణలో పోలీసులు డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు పోలీసులు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 25 పబుల్లో సోదాలు చేశారు. ఇందు కోసం 25 ప్రత్యేక టీమ్‌లు పని చేశాయి. డ్రగ్స్ వినియోగంపై 12 ప్యానెల్ డ్రగ్స్ డిటెక్షన్‌ కిట్‌తో పరీక్షలు చేశారు.

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు జాయింట్ కమిషనర్ ఖురేషి అసిస్టెంట్ కమిషనర్లు ఆర్ కిషన్ అనిల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్ పర్యవేక్షణలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. పబ్బుల్లోనూ, బార్లలోను డ్రక్స్ వినియోగంపై 12 పానెల్ డ్రగ్స్ డిటెక్షన్ కిడ్స్ తో పరీక్షలు చేశారు. హైదరాబాద్‌లోని 12, రంగారెడ్డి జిల్లాలోని 13 బార్లు, పబ్‌లపై దాడులు చేశారు. అందరికీ టెస్టులు చేశారు. 17 మందిపై డ్రగ్స్ పరీక్షలు డిటెక్షన్ బాక్స్ తో నిర్వహించారు. ఇందులో 50మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో పబ్ యాజమాన్యాలను పోలీసులు గట్టిగా హెచ్చరించారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ డ్రైవ్ లో భాగంగా ఇటువంటి తనిఖీలు మరిన్ని జరుగుతాయని చెప్పారు. కస్టమర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతించాలని సూచించారు. పబ్ సిబ్బంది ఎవరైనా డ్రగ్ సంబంధిత నేరాలకు పాల్పడితే ఆ పబ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.


Next Story