18 సంవత్సరాల వయస్సు నిండిన, ఆ పై వయస్సు గల వారు ఓటరు జాబితాలో పేరు లేని పక్షంలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన వారికి ఓటరుగా నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఓటరు నమోదుకు www.voters.eci.gov.in ఆన్ లైన్ ద్వారా గాని ఓటర్ హెల్ప్ లైన్ (voter helpline app) యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఫారం-6 లో పూర్తి వివరాల తో సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో సమర్పించవలెనని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమీషనర్ తెలిపారు.
అక్టోబర్ 1, 2023 అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తయ్యే వారు ముందస్తుగా ఓటరుగా నమోదు చేసుకోవవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్ కోరారు. పూర్తి వివరాలకు ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ 1950 కు సంప్రదించవచ్చుననీ జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.