అచ్చం పేటీఎం లాంటి యాప్ నే తయారు చేసి మోసం చేశారు.. అడ్డంగా దొరికిపోయారు
An app like PayTM to cheated, spoof Paytm app. అచ్చం పేటీఎం యాప్ ను పోలిన ఓ యాప్ ను తయారు చేసి.. డబ్బులు పంపిస్తున్నా అంటూ మోసం చేశాడు.
By Medi Samrat Published on 13 April 2021 12:54 PM GMTఇన్‌స్పెక్టర్ ఎస్.నవీన్ నేతృత్వంలోని బృందం హితేష్ వర్మను గుర్గావ్‌లో అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరు పరిచిన అధికారులు పీటీ వారెంట్‌పై సోమవారం నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. గుర్గావ్‌లోని పటౌడీ ప్రాంతానికి చెందిన హితేష్ వర్మ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తనకున్న పరిజ్ఞానంతో పేఏటీఎం స్ఫూఫ్ పేరుతో ఓ నకిలీ యాప్ సృష్టించాడు. దీన్ని కొన్నాళ్ల క్రితం గూగుల్ ప్లేస్టోర్స్‌లో ఉంచాడు. అనేక మంది ఈ స్ఫూఫ్డ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. సాధారణ పేటీఎం యాప్ ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు లావాదేవీ పూర్తయిన తర్వాత ఆ విషయం నగదు చెల్లించిన వ్యక్తి ఫోన్ స్కీన్ర్‌పై కనిపిస్తుంది. కొద్ది క్షణాల్లోనే నగదు పొందిన వ్యక్తి ఫోన్‌కూ సందేశం వస్తుంది. అయితే స్ఫూఫ్డ్ యాప్ ద్వారా చెల్లింపులు జరిపినట్లు వ్యాపారుల్ని మోసం చాలా సులువుగా చేసేయొచ్చు.
ఈ యాప్ దుకాణదారుడి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయకుండా.. డౌన్‌లోడ్ చేసుకున్న వ్యక్తే ఆ వ్యాపారి పేరు, ఫోన్ నెంబర్ తెలుసుకుని వాటిని ఈ నకిలీ యాప్‌లో ఎంటర్ చేస్తాడు. డబ్బును యాప్ లో సెలెక్ట్ చేస్తే.. నిజమైన పేటీఎం యాప్ మాదిరిగానే చెల్లించిన వ్యక్తి ఫోన్‌పై లావాదేవీ పూర్తయినట్లు డిస్‌ప్లే వస్తుంది. ఆ నగదు అందుకున్న వ్యక్తికి మాత్రం ఎలాంటి సందేశం రాదు. తమ ఫోన్‌లో వచ్చే మెసేజ్ ను చూపించి అక్కడి నుండి మాయమయ్యే వాళ్లు. ఏమో.. కొంచెం ఆలస్యంగా డబ్బు వస్తుందేమో అని కష్టమర్ ను ఇబ్బంది పెట్టకుండా పంపించేస్తూ ఉంటారు కాబట్టి కేటుగాళ్లు సులువుగా తప్పించుకుంటూ ఉంటారు.
హైదరాబాద్ పాతబస్తీలోని చిన్న చిన్న దుకాణాలు, జ్యూస్ సెంటర్ల వద్ద ఈ ఫేక్ యాప్ ను వినియోగించి చూశారు. చిన్న చిన్న షాపుల్లో పెద్దగా గిట్టుబాటు అవ్వదు అనుకుని.. పెద్ద పెద్ద షాపుల మీద కన్నేశారు. కంచన్‌బాగ్ పరిధిలోని ఓ వస్త్ర దుకాణంలో రూ.28 వేలు, చంద్రాయణగుట్టలోని స్పోర్ట్స్ స్టోర్‌లో రూ.8500, కిరాణా షాపులో రూ.10,700, మీర్‌చౌక్‌లో ఉన్న బంగారం దుకాణంలో రూ.28 వేలు ఇలా వ్యాపారం చేశారు. దీంతో నష్టపోయిన దుకాణదారులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఈ ఫేక్ యాప్ ను ఉపయోగిస్తున్న ముఠాపై దృష్టి పెట్టారు. అలా ఓ చోట మోసం చేస్తూ ఉండగా పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పేటీఎం ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు హితేష్ వర్మను పట్టుకుని.. హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు. ఈ ఫేక్ పేటీఎం యాప్ ను ఇంకా చాలా మందే హైదరాబాద్ లో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.