అర్ధరాత్రి.. మహిళతో ఏకాంతంగా గడుపుతూ.. భార్యకు అడ్డంగా దొరికిన ఇన్‌స్పెక్టర్‌

Hyderabad cop arrested for assaulting 2 constables after wife caught him cheating. హైదరాబాద్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో సౌత్ జోన్‌లో పనిచేస్తున్న ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్.. అర్ధరాత్రి వేళ కారులో ఓ మహిళతో

By అంజి  Published on  6 Nov 2022 4:17 AM GMT
అర్ధరాత్రి.. మహిళతో ఏకాంతంగా గడుపుతూ.. భార్యకు అడ్డంగా దొరికిన ఇన్‌స్పెక్టర్‌

హైదరాబాద్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో సౌత్ జోన్‌లో పనిచేస్తున్న ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్.. అర్ధరాత్రి వేళ కారులో ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఇన్‌స్పెక్టర్‌ రాజును అతని భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో ఇన్‌స్పెక్టర్‌.. తన భార్య, బంధువులపై గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే గొడవను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఇన్‌స్పెక్టర్‌ దాడి చేశాడు. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఇన్‌స్పెక్టర్ రాజు భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.

వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌స్పెక్టర్‌ రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బీఎన్‌రెడ్డి నగర్‌లో నివాసముంటున్నాడు. ఇటీవలే మునుగోడు ఉప ఎన్నిక విధుల్లో పాల్గొన్న రాజు.. ఆ తర్వాత నేరుగా ఇంటికి రాలేదు. దీంతో అనుమానం రావడంతో భార్య, ఆమె బంధువులు.. ఇన్‌స్పెక్టర్‌ రాజు కదలికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సాగర్ కాంప్లెక్స్ ఇంటీరియర్‌లో ఇన్‌స్పెక్టర్ రాజు, గుర్తు తెలియని మహిళతో కలిసి ఉన్నప్పుడు అతని భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. రాజుతో భార్య, బంధువులు గొడవకు దిగారు.

అర్ధరాత్రి సమయంలో అరుపులు వినిపించడంతో గస్తీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో రాజు అక్కడే ఉన్న కానిస్టేబుళ్లను దుర్భాషలాడడం, కొట్టడం ప్రారంభించాడు. ఒక కానిస్టేబుల్‌ ముఖంపై రక్తస్రావం జరిగింది. అదనపు సిబ్బంది సహాయంతో, నిందితుడు ఇన్‌స్పెక్టర్ రాజును సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి బ్రీత్ ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. అయినా అక్కడి సిబ్బందికి సహకరించకపోవడంతో తన ప్రవర్తన కొనసాగించాడు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story