అయ్యయ్యో వద్దమ్మా... సుఖీభవ... సైబర్ క్రైమ్ పోలీసులు కూడా..!
Hyderabad city police awareness on Cybercrimes.ఇటీవల శరత్ అనే ఓ డ్యాన్సర్ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ అయ్యయ్యో
By అంజి Published on 26 Sept 2021 12:01 PM ISTఇటీవల శరత్ అనే ఓ డ్యాన్సర్ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ అయ్యయ్యో వద్దమ్మా... సుఖీభవ... సుఖీభవ అంటూ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ మారిందో అందరికీ తెలిసిందే. ఆ వీడియో వైరల్‌తో శరత్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. శరత్ పాట పాడుతూ డ్యాన్ చేసిన ఈ వీడియోకి మీమ్స్‌తో విపరీతంగా ట్రోల్ అవుతోంది. శరత్ వీడియోను చూస్తూ మరికొందరు స్ఫూప్‌లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంది. హైదరాబాద్ సిటీ పోలీసులకు కూడా ఈ విషయం తెలవడంతో అయ్యయ్యో వద్దమ్మా... సుఖీభవ... సుఖీభవ అంటున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అయ్యయ్యో వద్దమ్మా... సుఖీభవ అంటూ మీమ్స్ రూపొందించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు.. కాంగ్రాట్స్.. ఈ గిఫ్ట్‌ను గెలుచుకునేందుకు ఇప్పుడే ఈ లింక్‌పై క్లిక్ చేయండి అంటూ వచ్చే ఎస్‌ఎమ్‌ఎస్‌లను చూసి మోసపొవద్దని.. అయ్యయ్యో వద్దమ్మా.. అనాలంటూ.. హైదరాబాద్ సిటీ, సైబర్ క్రైమ్ పోలీసులు ఫన్నీగా ట్వీట్లు చేశారు.
# అలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి....
— తెలంగాణ పోలీస్ - సైబర్ క్రైమ్ అవేర్నెస్ (@cyber_telangana) September 24, 2021
#సుఖీభవ #sukhibhava #cybersafety #yoursafetyisourfirstpriority@CyberCrimeRck @cyberabadpolice @hydcitypolice pic.twitter.com/07kbWn9Pu3
రెడ్ లేబుల్ టీ పౌడర్ కంపెనీ.. తమ బ్రాండ్‌కు పేరు రావడం కోసం ఓ యాడ్‌ను రూపొందించింది. ఆ యాడ్‌లో... రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో కూర్చున్న ముసలావిడ దగ్గరకు ఓ ట్రాన్స్‌జెండర్ వెళ్తుంది. దీంతో ముసలావిడ 10 రూపాయల నోటును ట్రాన్స్‌జెండర్‌కు ఇవ్వబోతుంది. ఇంతలో ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ... అయ్యయ్యో వద్దమ్మా.. ఈ పక్కనే నా టీకొట్టు ఉందమ్మా.. అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నాను.. అని అంటూ టీ ఇస్తుంది. దీంతో ట్రాన్స్‌జెండర్‌ను ముసలావిడ పిలిచి డబ్బులు ఇవ్వబోతుంది. అయ్యయ్యో వదదమ్మా ఈ రోజు నేను డబ్బులు తీసుకోను అని ట్రాన్స్ జెండర్ చెప్పడంతో.. డబ్బులు ఇవ్వడం లేదు కానీ సుఖీభవ అని అంటుంది. బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్.. మమకారపు మాధుర్యం అంటూ యాడ్ క్లోజ్ అవుతుంది.