గచ్చిబౌలిలో కారు ప్రమాదం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది.

By Srikanth Gundamalla  Published on  23 Dec 2023 10:51 AM IST
hyderabad, car accident, gachibowli, one dead ,

గచ్చిబౌలిలో కారు ప్రమాదం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉండగా.. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

గచ్చిబౌలి పరిధిలో ఈ రోడ్డుప్రమాదం సంభవించింది. కేర్‌ ఆస్పత్రి వద్దకు రాగానే ఒక కారు మితిమీరిన వేగంతో దూసుకొచ్చింది. అతివేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. కారు బోల్తా కొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డుప్రమాదం సంభవించగానే ఇతర వాహనాదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వెళ్లారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ఇక ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అతివేగంతా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంటున్నారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యిందనీ.. దాన్ని చూస్తే కారు వేగంగా నడిపారని అర్థం అవుతోందని అన్నారు. ఇక కారు నడిరోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కారును పక్కకు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు ఇంకా తెలియరాలేదనీ పోలీసులు చెప్పారు.


Next Story