Hyderabad: వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు.. యువతి మృతి (వీడియో)

హైదరాబాద్ లో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  14 Sept 2024 7:30 PM IST
Hyderabad:  వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు.. యువతి మృతి (వీడియో)

 Hyderabad: వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు.. యువతి మృతి (వీడియో)

హైదరాబాద్ లో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు యువతిని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. శుక్రవారం రాత్రి కొత్తగుడా చౌరస్తా లో ఈ ప్రమాదం జరిగింది. మాదాపూర్ వైపు నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న కలువ మాధవి (25) అనే యువతిని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. అయితే.. బస్సు రావడాన్ని గమనించలేకపోయిన యువతి తప్పించుకోలేకపోయింది. ఆ తర్వాత బస్సు కింద పడిపోయింది. డ్రైవర్‌ ఆపకుండా బస్సును ఆమెపైకి తీసుకెళ్లాడు. ఈ సంఘటనలో బస్సు చక్రాల కింద పడిన ఆ యువతి తీవ్ర గాయాల పాలైంది. అక్కడే ఉన్న స్థానికులు ఆమెను బస్సు కింద నుంచి బయటకు తీశారు. చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇక బస్సు వెనుక నుంచి వచ్చి.. మాధవిని బస్సు ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తాజాగా ఈ ప్రమాదం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశౄమనీ.. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. భాగ్యనగరంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదేపదే చెబుతున్నా కొందరు వినడం లేదు. అయితే.. ఈ ప్రమాద దృశ్యాలను చూసిన వారు అయ్యో అనుకుంటున్నారు.


Next Story