రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో బోనాల ఉత్సవాలు అంగరంగం వైభంగా కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  22 July 2024 5:25 AM GMT
Hyderabad, bonalu, swarnalatha, bhavishyavani,

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో బోనాల ఉత్సవాలు అంగరంగం వైభంగా కొనసాగుతున్నాయి. లష్కర్‌ బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 9.40 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ మేరకు మాట్లాడుతూ.. 'ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించా. నాకు సంతోషంగా ఉంది. కావాల్సిన పూజలన్నీ అందిస్తున్నారు. బోనం నాకు ఎవరు తెచ్చిన నాకు ఆనందమే. నన్ను చూడాలంటే 48 గంటల కష్టం అంటున్నారు. ఆ మాత్రం కష్టపడలేరా. ఏమి తెచ్చిన నేను ఆనందంగా తీసుకుంటా.. ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకుంటా.' అని చెప్పారు.

ఐదు వారాలు పప్పు బెల్లం పలహాలతో సాక పెట్టండి. రోగాలతో బాధపడుతున్న వారికి చల్లటి చూపుకై వారికి అండగా ఉంటాను. పాడిపంలు సంవృద్ధిగా చేసినట్లయితే తప్పకుండా రోగాలు రాకుంటా ఉంటాయి. నాకు రక్తపాసం ఇవ్వట్లేదు. మీకు నచ్చినట్లు ఇస్తున్నారు. దాంతోనే నేను సంతోషంగాఉన్నా. పూజలందూ సంతోషంగా ఉండాలి. గర్బ స్త్రీలకైనా, బాలలు కూడా ఎలాంటి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటా అని స్వర్ణలత భవిష్యవాణిలో చెప్పారు.

ఇక రంగం కార్యక్రమం తర్వాత భవిష్యవాణి కార్యక్రమం పూర్తయ్యింది. ప్రవచనం వినేందుకు పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు వెళ్లారు. మరోవైపు రంగం కార్యక్రమం సందర్భంగా అమ్మవారి దర్శనాలను నిలిపివేశారు. సాయంత్రం 7 గంటలకు ఫలహారం బండ్ల ఊరేగింపు ఉంటుందని ఆలయ అధికారులు చెప్పారు.

Next Story