హైదరాబాద్‌ వాసులకు గమనిక.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించే వారికి రైల్వే అధికారులు అలర్ట్‌ జారీ చేశారు.

By Srikanth Gundamalla  Published on  4 Feb 2024 7:39 AM GMT
hyderabad, mmts trains, cancelled ,

హైదరాబాద్‌ వాసులకు గమనిక.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించే వారికి రైల్వే అధికారులు అలర్ట్‌ జారీ చేశారు. 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మౌలాలి-సనత్‌నగర్‌ స్టేషన్ల మధ్య నాన్‌-ఇంటర్‌ లాకింగ్ పనుల కారణంగా ఆదివారం జంటనగరాల్లో తిరిగే 23 ఎంఎంటీఎస్ రైల్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రద్దు అయిన రైళ్లలో ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్‌లు, 10వ తేదీ వరకు మరో రెండు, 11 వ తేదీ వరకు మరో 18 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంతరాయాన్ని గమనించాలని ప్రయాణికులకు రైల్వే అధికారులు సూచించారు.

మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే దాదాపు 51 రైళ్లను రద్దు చేశామని వెల్లడించారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు టైమ్‌ టేబుల్ వారీగా రైళ్ల రద్దు ఉంటుందని చెప్పారు. సాధారణ రైళ్లతో పాటు ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేశామన్నారు. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, వికారాబాద్-గుంటూరు, రేపల్లె-సికింద్రాబాద్‌ తో పాటుగా లింగంపల్లి-హైదరాబాద్, లింగంపల్లి-ఉందానగర్, లింగంపల్లి-ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ల మధ్య టైమ్‌ టేబుల్ ప్రకారం ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు కొనసాగుతుందని రైల్వే అధికారులు చెప్పారు.

Next Story