Hyderabad: రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు

హైదరాబాద్ నగరంలో బుధవారం తెల్లవారుజామున రెండు అగ్నిప్రమాదాలు జరిగాయి. హబ్సీగూడాలో, అత్తాపూర్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదాల్లో మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడ్డాయి.

By అంజి  Published on  2 Aug 2023 10:15 AM IST
fire accidents, Hyderabad city, Habsiguda

Hyderabad: రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు

హైదరాబాద్ నగరంలో బుధవారం తెల్లవారుజామున రెండు అగ్నిప్రమాదాలు జరిగాయి. హబ్సీగూడాలో, అత్తాపూర్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదాల్లో మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడ్డాయి. హబ్సిగూడలోని అన్‌ లిమిటెడ్ షోరూమ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతూ ఉండడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని చీకటిమయం చేశాయి. రెండు అంతస్థుల నుండి దట్టమైన పొగలు బయటకు వెదజల్లుతున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించిన షోరూం పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.

ఈ ప్రమాదం జరిగిన ఘటన ఉప్పల్- సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు అత్తాపూర్ లోని హసన్ నగర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బట్టల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు బయటకు వ్యాపిస్తూ ఉండడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని చీకటి మయం చేయడంతో భయబ్రాంతులకు గురి అయిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే పనిలో పడ్డారు. పక్క ఉన్న ఇండ్లకు వ్యాపించ కుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్త పడుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.

Next Story