సెప్టెంబర్ 17 చుట్టూ రాజకీయాలు.. ఇంకెన్ని చూస్తామో..!

How celebrating September 17 as 'Liberation-Day' will further isolate Muslims. సెప్టెంబర్ 17.. హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో విలీనమైన రోజు. ప్రస్తుతం ఈ రోజు చుట్టూ ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sep 2022 7:46 AM GMT
సెప్టెంబర్ 17 చుట్టూ రాజకీయాలు.. ఇంకెన్ని చూస్తామో..!

సెప్టెంబర్ 17.. హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో విలీనమైన రోజు. ప్రస్తుతం ఈ రోజు చుట్టూ ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక వర్గమేమో తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలని పిలుపును ఇవ్వగా.. మరికొందరు జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే న్యూస్ మీటర్ బృందం మాత్రం సాయుధ పోరాటం, చరిత్రను భవిష్యత్‌ తరాలకు అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించింది.

సెప్టెంబర్ 17కు సంబంధించి NewsMeter ప్రముఖ వ్యక్తుల నుండి నివేదికలను ప్రచురిస్తోంది. మా నివేదికలు ఆనాటి చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. రాజకీయాల జోలికి వెళ్లకుండా, నిజాం పాలనపై సుదీర్ఘ పోరాటం, సాయుధ ప్రతిఘటన, స్వాతంత్య్ర పోరాటం, ఆపరేషన్ పోలో మొదలైన వాటిపై చర్చిస్తాం.

మా కథనాలు.. బ్రిటిషర్ల నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం, దేశ విభజనపై ఉంటాయి. రాచరిక రాష్ట్రాలు భారత దేశంలో ఎలా చేరాయో మేము వివరిస్తాం. మూడు భాషా ప్రాంతాలను కలిగి ఉన్న నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ ఎలా ఉండేది. తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతం (రాజధాని నగరం హైదరాబాద్‌తో సహా), మరాఠీ మాట్లాడే మరాఠ్వాడా, కన్నడ మాట్లాడే ప్రాంతం కొంత భాగం వరకూ నిజాం పాలనలో ఉండేవి. ఇవి భారత ప్రభుత్వ ఆధీనంలోకి ఎలా తీసుకురాబడ్డాయన్నది తెలియజేస్తాం.

హైదరాబాద్: సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం ఎన్నో రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సెప్టెంబర్ 17, 1948 నాటి సంఘటన ప్రకారం.. భారత ఉపఖండంలోకి హైదరాబాద్ వచ్చి చేరింది. అందుకు సంబంధించి అంతకు ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు హైదరాబాద్ ను భారత్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమవ్వడాన్ని చాలా మంది ఎన్నో పేర్లతో పిలుస్తున్నారనుకోండి.

భారతదేశంలో హైదరాబాద్ విలీనమవ్వడాన్ని పలువురు పలు రకాలుగా పిలుస్తూ వస్తున్నారు. 1948 తర్వాత, ముస్లిం పొలిటికల్ పార్టీలు ఆ రోజుని 'జాతీయ సమైక్యతా దినోత్సవం'గా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాయి. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇతాద్-ఉల్-ముస్లిమీన్) నాయకుడు అసదుద్దీన్ ఒవైస్ 'జాతీయ సమైక్యతా దినోత్సవం' అనే పదాన్ని ఉపయోగించాలని చెబుతూ.. భారత హోంమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, బీజేపీకి లేఖ రాశారు. 'విమోచన దినం' కంటే 'జాతీయ సమైక్యతా దినోత్సవం' అనే పదం సముచితంగా ఉంటుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భావిస్తోంది. నెహ్రూ పాలన వారసత్వంపై బీజేపీ ఎప్పటి లాగే విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. దీనిని భారత ప్రజాస్వామ్యంలో చీకటి యుగంగా పరిగణించారు కూడానూ..! ఒక హిందూ-రైట్ వింగ్ వైపు మొగ్గు చూపే ప్రముఖుడు 2014లో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే వ్యాఖ్యలు చేశారు. 1947లో వచ్చిన దేశ స్వాతంత్య్రాన్ని "భిక్ష"గా అభివర్ణించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతో మందిని బాధించింది కూడా..!

రెండు విలక్షణమైన విరుద్ధమైన కథనాలు భారత రాజకీయాలలో కనిపిస్తూ ఉంటాయి. హిందూ-ముస్లిం అనే అంశాలను కూడా రాజకీయాల్లో వాడుకుంటూ వస్తున్నారు. భౌగోళికంగా, తెలంగాణ పూర్వపు మొఘల్ సామ్రాజ్యం సరిహద్దులో ఉంది. ఆ పాలకులు ఇక్కడి హిందువులను వేధించారని కూడా చరిత్ర చెబుతుంది. ఘాజీ, ఘోరీ, ఖిల్జీ, మొఘల్‌ పాలకులను దూషించడం చేస్తుంటారు. స్వతంత్ర భారతదేశంలోని ముస్లింలకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తున్నారు. కానీ ఒకప్పటి నిరంకుశ ముస్లిం పాలనను చూపించి.. ఇప్పుడు విమర్శలు చేయడం కూడా తగదు.

సెప్టెంబరు 17వ తేదీని 'విమోచన దినోత్సవం'గా జరుపుకోవడమంటే, జాతి నిర్మాణంలో దేశద్రోహుల సంతానంగా ముస్లింలను మరింతగా వేరుచేయడమవుతుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ముస్లిం రాజకీయ వాదనను చట్టబద్ధం చేయడమే అవుతుంది. తెలంగాణలోని ముస్లిం ఆధారిత రాజకీయ పార్టీ భారత ఎన్నికల సంఘంచే గుర్తించబడింది. అయినా రజాకార్ల వారసత్వంగా సదరు పార్టీని ఇంకా నిందిస్తూనే ఉన్నారు.

కొన్ని పార్టీల రాజకీయ వ్యూహం భారతదేశం అంతటా ఒకేలా ఉంది. సెప్టెంబర్ 17ని 'విమోచన దినోత్సవం'గా జరుపుకోవడం అందులో ఒక భాగం. తెలంగాణ ముస్లింలపై ప్రతీకార రాజకీయాలను రెచ్చగొట్టేందుకు సెప్టెంబర్ 17 ఒక్కటే మార్గం కాదు.. ఇంకెన్నో ఉన్నాయి. 1940లో VII నిజాం చేత కొమరం భీమ్ (గిరిజన-గోండు నాయకుడు) ఉరితీత గురించి తెలిసిందే..! కొమరం భీమ్ ఆధారంగా ఇటీవల వచ్చిన RRR తెలుగు సినిమా దాని ప్రాంతీయ ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఉత్తర తెలంగాణలో ముస్లింలు, గోండులపై ద్వేషాన్ని రేకెత్తించడానికి ఆయన ఉరి ఒక కీలక ఘట్టం.

ఉత్తర భారతదేశంలో ఇలాంటి వ్యూహం ఇప్పటికే ఆచరణలో ఉంది. సుహల్ దేవ (ఉత్తరప్రదేశ్‌లోని పాసి-దళిత కమ్యూనిటీకి ఎంతో ముఖ్యమైన వ్యక్తి) 1034 A.D.లో ఘాజీకి చెందిన మహమూద్ గాజీ జనరల్ అయిన గాజీ-మియాను ఓడించారు. సుహల్ దేవ విషయంలో కూడా రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి రాజకీయాలే తెలంగాణ రాష్ట్రంలో కూడా చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. కొన్ని వర్గాలు ముస్లింలపై ద్వేషాన్ని పెంపొందించేలా ప్రణాళికలను రచిస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ గా దూసుకొనిపోడానికి ఎన్నో చరిత్ర వక్రీకరణలలో కూడా భాగమయ్యే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

(కథనంలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.. న్యూస్‌మీటర్ వి కావు)

Next Story