డబ్బులు ఇవ్వని వైన్స్ సిబ్బంది.. పోలీసుల ముందే బట్టలిప్పి హిజ్రాల డాన్స్

Hijras Hulchul In Malkajgiri. రాత్రి మల్కాజిగిరి పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న వైన్స్ వద్ద హిజ్రాలు హల్చల్ చేశారు

By Medi Samrat  Published on  22 March 2021 7:58 AM GMT
Hijras Hulchul In Malkajgiri

రాత్రి మల్కాజిగిరి పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న వైన్స్ వద్ద హిజ్రాలు హల్చల్ చేశారు. డబ్బుల కోసం వైస్ సిబ్బందిపై దాడి చేశారు. హిజ్రాలు డబ్బులు అడగ్గా.. వైన్స్ సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో విచ్చలవిడిగా ప్రవర్తించారు. అర్ధనగ్నంగా హిజ్రాలు విచ్చలవిడిగా ప్రవర్తించడంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పోలీసులు వచ్చినప్పటికీ ఏ మాత్రం హిజ్రాలు తగ్గలేదు.


మొదట వైన్స్ వద్దకు వచ్చిన హిజ్రాలు డబ్బుల కోసం డిమాండ్ చేశారు. ఇవ్వమని వైన్స్ సిబ్బంది తిట్టడంతో హిజ్రాలు ఏ మాత్రం తగ్గలేదు. బూతులు తిడుతూ వీరంగం వేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సర్ది చెప్పినా వినలేదు. ఏకంగా పోలీసుల ముందే చీర విప్పేసి ఒకరు బీభత్సం సృష్టించారు. మరికొందరు అసభ్యంగా ప్రవర్తిస్తూ రోడ్డుపై వెళ్తున్నవారికి ఇబ్బంది కలిగించారు. ఓ హిజ్రా ఏకంగా చీర విప్పేసి పోలీసుల ముందే రోడ్డుపై పరిగెత్తుకుంటూ వెళ్లడం సీసీటీవీలో రికార్డు అయింది. అర్ధ నగ్నంగా హిజ్రాలు ప్రవర్తించిన తీరు అటుగా వెళ్తున్న వారికి ఇబ్బందులకు గురి చేసింది.


Next Story
Share it