క‌ర్మ‌న్‌ఘాట్ వ‌ద్ద ఉద్రిక‌త్త‌

High Tension in Karmanghat.హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ గుడి సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

By M.S.R  Published on  23 Feb 2022 6:13 AM GMT
క‌ర్మ‌న్‌ఘాట్ వ‌ద్ద ఉద్రిక‌త్త‌

హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ గుడి సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు ఆవులను తరలిస్తున్నారని సమాచారం అందుకున్న హిందూ గోరక్షకులు ఆ ప్రాంతానికి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక గోవులను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని ఇన్నోవా వాహనంలో వెంబడిస్తూ గో రక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. అయితే గో రక్షక్ సభ్యుల ఇన్నోవా వాహనాన్ని బొలెరోతో ఢీకొట్టారు. గో రక్షకులపై కత్తులతో దాడి చేసి ఇన్నోవా కారును ధ్వంసం చేశారు. దుండగులు కత్తులతో దాడి చేయడంతో.. ప్రాణాలు దక్కించుకునేందుకు గో రక్షక్ సభ్యులు స్థానిక హనుమాన్ దేవాలయంలోకి పరుగులు తీశారు. దేవాలయంలోకి ప్రవేశించిన వారిపైనా దాడి చేసిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గో రక్షక్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

గోరక్షకులపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద నిరసనకు దిగారు. అయితే వారిని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. భారీగా భద్రత సిబ్బందిని రంగంలోకి దింపిన పోలీసులు, నిరసన ప్రదర్శన చేస్తున్న వారిని బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు.

Next Story
Share it