మైనర్లతో అసభ్యకరమైన వీడియోలు.. బాగా డబ్బులు సంపాదిస్తున్న తెలుగు యూట్యూబర్లు వీరే

చాలా మంది తెలుగు యూట్యూబ్ వ్లాగర్‌లు అసభ్యకరమైన కంటెంట్ ను పోస్టు చేస్తూ ఇదే ఎంటర్టైన్మెంట్ అని చెడును ప్రమోట్ చేస్తున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 July 2024 10:30 AM GMT
Telugu YouTubers, obscene videos, minors, obscene content

మైనర్లతో అసభ్యకరమైన వీడియోలు.. బాగా డబ్బులు సంపాదిస్తున్న తెలుగు యూట్యూబర్లు 

లైంగికపరమైన అంశాలు, పిల్లలతో బూతులు, మద్యపానం, వేధింపులు, సైబర్ బెదిరింపు, నైతిక పోలీసింగ్ వంటి వాటిని ఉపయోగించి సంవత్సరాల తరబడి చాలా మంది తెలుగు యూట్యూబర్లు పెద్ద ఎత్తున వ్యూస్, ఫాలోవర్లు దక్కించుకోవడమే కాకుండా డబ్బులు కూడా బాగా సంపాదించారు. చాలా మంది తెలుగు యూట్యూబ్ వ్లాగర్‌లు అసభ్యకరమైన కంటెంట్ ను పోస్టు చేస్తూ ఇదే ఎంటర్టైన్మెంట్ అని చెడును ప్రమోట్ చేస్తున్నారు.

అలాంటి కంటెంట్ సృష్టికర్తలలో ఒకరు తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అతనిపై జూన్ 7న ఫిర్యాదు నమోదు చేసింది. ఇది ఒక ఆడపిల్ల గురించి అతను అనుచిత వ్యాఖ్యలను చేశాడు. ఇది 'డార్క్ హ్యూమర్' అంటూ చెప్పుకొచ్చాడు. అతను @phanumantu పేరుతో 182K ఫాలోవర్లతో ఒక ఛానెల్‌ని నడుపుతున్నాడు. అతని తాజా వీడియోలో.. ప్రణీత్, మరికొందరు అమ్మాయిల గురించి అనుచితమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసారు. హాస్యం నెపంతో తండ్రీ-కూతుళ్ల సంబంధాన్ని లైంగికంగా మార్చారు. ఇది వారి 'రోస్ట్' కామెడీలో ఒక భాగం.

రోస్ట్ కామెడీ అంటే ఏమిటి?

ప్రణీత్ హనుమంతు, అలాంటి యూట్యూబ్ ఛానెల్‌లను నిర్వహించే ఇతరులు ఎక్కువగా వారి కంటెంట్‌లో 'రోస్టింగ్' కింద చెబుతారు. ఇతరులను ఎగతాళి చేయడం ద్వారా హాస్యభరితమైన కంటెంట్‌ను రూపొందించడానికి ఉపయోగించే పదం.. ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తూ అనుచితమైన కంటెంట్ ను ప్రజల మీద రుద్దుతూ ఉంటారు.

ఇతర వినియోగదారులు సృష్టించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను ఎంచుకుంటారు. పబ్లిక్ కోసం ప్రత్యక్ష ప్రసారం చేసే ఆన్‌లైన్ సమావేశంలో బూతులు తిట్టడం, అసభ్యకరమైన విషయాలను ప్రస్తావించడం, బాడీ షేమింగ్‌లో పాల్గొనడం చేస్తూ ఉంటారు. ఈ లైవ్ స్ట్రీమ్‌లను మైనర్‌లతో సహా అన్ని వయసుల వారు యాక్సెస్ చేస్తూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. సోషల్ మీడియాలో పిల్లలపై జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాల గురించి సినీ నటుడు సాయిధరమ్ తేజ్ హైలైట్ చేయగా.. తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క ఆదివారం చెప్పడంతో తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అసభ్యకరమైన, అనుచితమైన కంటెంట్ గురించి అధికారుల దృష్టికి తీసుకురావడానికి న్యూస్‌మీటర్ అటువంటి కొంతమంది క్రియేటర్లకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంచుతోంది.

వినయ్ కుయ్య

508K కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న 'వినయ్ కుయ్య' అనే ఛానెల్, వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన స్క్రిప్ట్‌డ్ 'డేర్స్' చేస్తుంది. అలా వారు వెంబడించిన ఒక వ్యక్తి 'అక్రమ సంబంధం' కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా నివేదించబడింది. ఆశ్చర్యకరంగా, ఇంకా ఇలాంటి కంటెంట్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు. వీటిలో లైంగిక కంటెంట్, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి కూడా ఉన్నాయి.

విజయ్ గౌడ్

ఛానెల్ విజయ్ గౌడ్ 457K సబ్‌స్క్రైబర్‌లతో షోను నడుపుతున్నట్లు పేర్కొంది. ఇందులో 'యూట్యూబ్ స్టార్స్' అని పిలవబడే వారు ఎక్కువగా మద్యం మత్తులో ఉంటారు. మానసిక అనారోగ్యంతో ఉన్నారు. వారు సరదా, కామెడీ ముసుగులో మహిళలపై అశ్లీలత, లైంగిక కంటెంట్ ప్రోత్సహిస్తారు.

పరేషాన్ బాయ్స్

పరేషాన్ బాయ్స్ అనే ఛానెల్ పిల్లలపై వేధింపులతో కూడిన 'డేర్' కంటెంట్‌తో ఉంటుంది. వారు పాఠశాలకు వెళ్లే పిల్లవాడిని, అతని ‘సంబంధాలను’ దృష్టిలో ఉంచుకుని వీడియోలను అప్‌లోడ్ చేస్తారు. రోడ్లపై ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తారు.

ఆరిఫ్ ది ఎంటర్‌టైన్‌మెంట్

'ఆరిఫ్ ది ఎంటర్‌టైన్‌మెంట్' అనే ఛానెల్ గ్రామీణ వ్యక్తులకు తన కారులో లిఫ్ట్ అందించడం ద్వారా ప్రాంక్ లను చేస్తారు. లోపల కూర్చున్న వారిని భయపెట్టేలా కొన్ని చెబుతారు. మేము దిగిపోతాము అంటూ వాళ్లు చెప్పినా కూడా వినకుండా తీసుకుని వెళతారు. ఇందులో చిన్న పిల్లలను కూడా అలాగే భయపెట్టిన కంటెంట్ ఉంది. అయితే 'అవగాహన పెంచడం' కోసం ఇదని చెబుతూ ఉంటారు.

ఈ జాబితా ఇక్కడితో ముగియదు. అనేక ఇతర ఛానెల్‌లు లక్షలాది మంది చందాదారులతో ఇటువంటి అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టిస్తూ ఉన్నాయి. వారు తరచుగా YouTube కఠినమైన మార్గదర్శకాల నుండి తప్పించుకుంటారు. లక్షల్లో వ్యూస్ పొందుతారు. ఇలాంటి వారికి ప్రమోషన్ కోసం తెలుగు సినిమా తారలు కూడా సహకరిస్తారు.

ఇలాంటి కంటెంట్‌పై YouTube చర్యలు:

YouTube తన తాజా నివేదికలో, 2024 జనవరి నుండి మార్చి 2024 వరకు 8,295,304 వీడియోలను తీసివేసినట్లు పేర్కొంది. YouTube యొక్క ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్‌ల ద్వారా ఎక్కువగా ఫ్లాగ్ చేయబడిన కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశం నుండి 2,618,760 వీడియోలు తొలగించారు. ఈ మొత్తం వీడియోలలో నలభై మూడు శాతం పిల్లల భద్రతా కారణాల దృష్ట్యా తీసివేశారు.

కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌లో పేర్కొన్న విధంగా కంటెంట్‌ను ఖచ్చితంగా నిషేధించడంలో YouTube విఫలమైంది. అందుకే ఇలాంటి కంటెంట్ ను చూస్తూ యువకులు, పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. అలాంటి కంటెంట్ ఓపెన్ ప్లాట్‌ఫారమ్‌లో సులభంగా యాక్సెస్ చేస్తున్నారు. సరదా కోసం, హాస్యం కోసం మాత్రమే అనే ముసుగులో అశ్లీల కంటెంట్‌ వ్యాప్తిపై ప్రభుత్వాలు, యూట్యూబ్ జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది.

Next Story