గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదేళ్ల తర్వాత ఈ కేసులో రాజా సింగ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ఇటీవలే నాంపల్లి ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కొద్దిరోజుల కిందట నాంపల్లి ప్రత్యేక కోర్టు రాజా సింగ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఐదు సంవత్సరాల క్రితం కేసు నమోదయ్యింది. పోలీస్ స్టేషన్‌లో రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు హై కోర్టులో ఊరట లభించడంతో రాజా సింగ్ ఊపిరి పీల్చుకున్నారు.