పెళ్లిలో కన్నీరు పెట్టుకున్న వరుడు.. కారణం అదే?
Groom crying at his marriage event.సాధారణంగా పెళ్ళి తంతు కార్యక్రమం జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు హాజరుకాలేదని కన్నీరు పెట్టుకున్న వరుడు.
By తోట వంశీ కుమార్ Published on 16 Jan 2021 1:15 PM GMTసాధారణంగా పెళ్ళి తంతు కార్యక్రమం జరుగుతున్నప్పుడు పెళ్ళిలో తాళి కట్టే సమయంలో వధువు కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా వధువు తల్లిదండ్రులు అప్పగింతలప్పుడు ఇన్ని రోజులుగా తాము పెంచి పెద్ద చేసిన కూతురును మరొకరి ఇంటికి పంపించడం పట్ల కొంతవరకు భావోద్వేగానికి కంటతడి పెడుతుంటారు. కానీ మీరు ఎప్పుడైనా పెళ్లిలో వరుడు ఏడవడం చూశారా? ఈ విధంగా పెళ్లిలో ఎంతో భావోద్వేగానికి గురైన ఓ వరుడు ఏడ్చిన ఘటన జెడ్డాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్ సంతోష్ నగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్దాద్ అలీ.. జెడ్డాలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అయితే అలీ వివాహం గతేడాది మార్చిలో జరపాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే అలీ కుటుంబ సభ్యులు ఎక్కువ మంది జెడ్డాలో ఉండటం వల్ల అతని వివాహం అక్కడే జరగాలని కుటుంబ సభ్యులు భావించారు. అంతలోనే కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో అలీ తల్లిదండ్రులు జెడ్డా వెళ్లలేకపోయారు. దీంతో వారి పెళ్లి కూడా వాయిదా పడింది.
ఇప్పటికి కూడా అలీ తల్లిదండ్రులకు వీసా రాకపోవడంతో.. వీరి పెళ్లికి చాలా ఆలస్యమైందని భావించిన ఇరు కుటుంబాల పెద్దలు అలీ వివాహం జరగాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల పెద్దలు లేకుండా అలీ పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరుడు తల్లిదండ్రులు లేకుండా పెళ్లి జరిపించడంతో కొంతవరకు భావోద్వేగానికి గురైన అలీ తనను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకు వచ్చిన తన తల్లిదండ్రులు తన జీవితం లో జరగబోయే ముఖ్యమైన వివాహ వేడుకకు తన తల్లిదండ్రులు హాజరుకాలేదని వారిని గుర్తు చేసుకుంటూ కొంతవరకు ఉద్వేగానికి గురై కంటతడి పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.