తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్( భాగ్యనగరం)లోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఈ మహమ్మారి కట్టడి చేసేందుకు జీహెచ్ఎంసీ( గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) చర్యలు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. ఈ మినీ కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో పటిష్ట చర్యలు చేపట్టనుంది.
5 పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ ఉంటే.. మినీ కంటైన్‌మెంట్ జోన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఒకే అపార్టుమెంట్‌లో ఎక్కువ కేసులు వస్తే.. హౌజ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తారు. కస్టర్ పరిధిలో బారీగేడ్లు, ఫెక్సీలు ఏర్పాటు చేసి కేవలం శానిటైషన్, మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బందిని మాత్రమే అనుమతించనున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. హెరిస్కీ ప్రాంతాల్లో ఇంటెన్సివ్ శానిటేషన్, యాంటీ లార్వా స్రేయింగ్ చేస్తున్నారు. కూకట్ పల్లి, నిజాంపేట్, కేపీహెచ్ బీ వంటి ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌తో శానిటైజ్ చేశారు.
మినీ కంటైన్‌మెంట్ జోన్లు ఇవే..